టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీగా కొత్త యాప్‌.. పూర్తి వివరాలు.. | Vreels App: Telugu Engineers Launch Global All-in-One Social, Chat & Shopping Platform | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీగా కొత్త యాప్‌.. పూర్తి వివరాలు..

Nov 1 2025 9:50 AM | Updated on Nov 1 2025 11:49 AM

Vreels Virtually Relax Explore Engage Live Share app in tech market

డిజిటల్ యుగం మన జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. ప్రతి రోజూ మనం ఎన్నో యాప్‌లు ఉపయోగిస్తూ ఉంటాం. అందులో కొన్ని చాటింగ్‌ కోసం, మరికొన్ని వీడియోల కోసం, ఇంకొన్ని షాపింగ్ కోసం.. వాడుతుంటాం. అయితే ఒకే వేదికపై ఇలాంటి సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వీరీల్స్‌(Vreels-Virtually Relax, Explore, Engage, Live, Share) రూపొందించారు. ప్రపంచానికి కొత్త తరహా డిజిటల్ అనుభవాన్ని అందించడానికి అమెరికాలోని తెలుగు ఇంజినీర్లు దీన్ని తయారు చేశారు.

ఇది ఇప్పటికే 22 దేశాల్లో విడుదలై, ప్రస్తుతం బీటా దశలో ఉంది. Play Store, App Storeలో Vreelsను డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ కొత్త అనుభవాన్ని ఆస్వాదించవచ్చని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.

వెబ్సైట్: www.vreels.com

సృజనాత్మకతతో..

Vreels ఒకే చోట కంటెంట్‌ సృష్టి, వినోదం, సంభాషణకు డిజిటల్ వేదికగా మారింది. ఇందులో ప్రతి యూజర్ ఒక క్రియేటర్‌గా మారొచ్చు. చిన్న వీడియోలు, ఫొటోలు, క్రియేటివ్ స్టోరీస్‌ను వ్యక్తిగతంగా యూజర్ల ఆసక్తులకు సరిపోయేలా రూపొందించుకోవచ్చు. ఇందులోని ఫీడ్ యూజర్లు ఇష్టపడే విషయాలను నేర్చుకుంటూ మరింత పర్సనల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. యాప్‌లోని కొన్ని ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.

Reels, Pix

మీ భావాలు, ప్రయాణాలు, ఆలోచనలు.. అన్నీ ఒక క్లిక్‌లో రికార్డ్ చేసి, ఎడిట్ చేసి ఇతరులతో పంచుకోవచ్చు. వీడియోలు, ఫొటోల రూపంలో ఆకస్తి కరంగా యూజర్లు తమ భావాలను వ్యక్తీకరించవచ్చు. ఫిల్టర్లు, టెక్స్ట్, స్టిక్కర్లు, మ్యూజిక్ సపోర్త్‌తో Vreels క్రియేటర్లకు మెరుగైన అనుభవం ఇస్తుంది.

Pix Pouches.. డిజిటల్‌ నోట్‌బుక్‌

Pix Pouches అనేది డిజిటల్ నోట్‌బుక్‌. ఇష్టమైన ఫొటోలను లేదా ఆలోచనలను వర్గాల వారీగా స్టోర్‌ చేసుకోవచ్చు. మిత్రులతో కలిసి కలెక్షన్లు సృష్టించి, మంచి ప్రాజెక్టులను ప్లాన్ చేయవచ్చు.

Chats, Calls — కనెక్ట్ అ​‍య్యేందుకు..

స్నేహితులతో మాట్లాడటానికి, గ్రూప్‌లో చాట్ చేయటానికి లేదా వీడియో కాల్ చేసుకోవటానికి వేర్వేరు యాప్‌లు అవసరం లేదు. Vreelsలోనే ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. వీరీల్స్‌ క్రియేటివ్ వేదికగా ఉన్నందున ఇది సాధ్యపడింది. మీరు మాట్లాడుతూనే మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవచ్చు.

V Map — లొకేషన్‌ షేరింగ్‌

మీ స్నేహితులు లేదా కమ్యూనిటీ సభ్యులు ఎక్కడ ఉన్నారో V Mapతో సులభంగా  తెలుసుకోవచ్చు. లొకేషన్ షేరింగ్ పూర్తిగా మీ నియంత్రణలో ఉంటుంది.

V Capsules — మధుర జ్ఞాపకాలు

ఈ ప్రత్యేక ఫీచర్‌లో భావోద్వేగ జ్ఞాపకాలను డిజిటల్‌గా ఒక ‘క్యాప్సూల్’లో ఉంచి ఒక నిర్దిష్ట తేదీన దాన్ని ఓపెన్‌ చేసి చూసుకోవచ్చు. బర్త్‌డే, యానివర్సరీ, లేదా మైల్‌స్టోన్‌.. వంటి ముధుర జ్ఞాపకాలను భద్రపరుచుకొని తిరిగి ఆ మెమొరీని చూసుకోవడం ఆనంద క్షణంగా ఉంటుంది.

Vreels Shop/Bid — మీ అవసరాలన్నీ ఒకే చోట

Vreels షాప్/బిడ్ త్వరలో రాబోతోంది. యూజర్లకు కావాల్సిన ప్రతి ఉత్పత్తిని ఇందులో కొనుగోలు చేయవచ్చు. వెండర్లు తమ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తారు. యూజర్లు నమ్మకంగా ఇందులో బిడ్ చేయవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు. ఇది అంతా ఒకే సురక్షితమైన, సౌకర్యవంతమైన వేదికలో జరుగుతుంది. నమ్మకం, నాణ్యత, విశ్వాసం ఇవే Vreels షాప్/బిడ్ పునాది సూత్రాలని నిర్వాహకులు చెబుతున్నారు.

భద్రత.. యూజర్ విశ్వాసమే ప్రాధాన్యం

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రపంచంలో మన డేటా ఎక్కడికి వెళ్తుందో, ఎవరు వాడుతారో అన్న సందేహం సహజం. కానీ Vreelsలో మీరు ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూజర్ల డేటాకు అధిక భద్రత ఉంటుంది.

టోకెన్ ఆధారిత ప్రామాణీకరణ, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌, యూజర్ నియంత్రిత ప్రైవసీ సెట్టింగులు.. ఇవన్నీ యూజర్ల వ్యక్తిగత డేటాను కాపాడటానికి ఎంతో తోడ్పడుతాయి. ముఖ్యంగా యూజర్‌ పోస్టులు, ప్రొఫైల్, లొకేషన్.. ఎవరు చూడాలో నిర్ణయించే అధికారం పూర్తిగా యూజర్‌ పరిధిలోనే ఉంటుంది.

Vreels ఆవిష్కరణల వేదిక

Vreels ఒక యాప్ మాత్రమే కాదు. అమెరికన్‌ వ్యాపార స్పూర్తిని, భారతీయ స్వయం ఆవిష్కరణ శక్తిని ప్రతిబింబించే ఒక వేదిక. ప్రతి అప్‌డేట్‌తో కొత్త సాంకేతిక పరిణామాలు, స్థానిక భాషల సపోర్ట్, యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచే మార్పులు తెస్తోంది. ఇది Made for the World అనే స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తుంది. ఇప్పటికే Vreels బృందం వినూత్న సాంకేతిక పేటెంట్లను దాఖలు చేసింది. ఇవి ప్రస్తుతం ఆమోద దశలో ఉండగా, త్వరలోనే మంజూరు అవుతాయని అంచనా. ఈ పేటెంట్లు ఆమోదం పొందిన తర్వాత Vreels సాంకేతిక సామర్థ్యం మరింత బలపడటమే కాక, అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపు లభించనుంది.

Vreels యాప్ డౌన్‌లోడ్ చేసుకోనే లింక్‌లు కింద ఉన్నాయి.

ఆండ్రాయిడ్‌ యూజర్లు

https://play.google.com/store/apps/details?id=com.mnk.vreels

యాపిల్‌ యూజర్లు

https://apps.apple.com/us/app/vreels/id6744721098  

కింది క్యూఆర్‌ కోడ్‌లు స్కాన్‌ చేసి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement