
వొడాఫోన్ ఐడియా (వీఐ) తన యూజర్లకు అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం ఒక్క రూపాయికే రూ.4,999 రీఛార్జ్ ప్లాన్ ను అందిస్తోంది. వీఐ గేమ్స్ లో గెలాక్సీ షూటర్ ఫ్రీడమ్ ఫెస్ట్ ఎడిషన్ ను వొడాఫోన్ ఐడియా ప్రవేశపెట్టింది. ఈ స్పెషల్ ఎడిషన్ ఫెస్ట్ కింద అనేక రివార్డులను అందిస్తుండగా వాటిలో ఒకటే ఒక్క రూపాయికి రూ .4,999 రీచార్జ్ ప్లాన్.
ఆగస్టు 31 వరకే ఆఫర్
టెలికామ్ టాక్ నివేదిక ప్రకారం.. వీఐ గేమ్స్ పై గెలాక్సీ షూటర్స్ ఫ్రీడమ్ ఫెస్ట్ ఎడిషన్ ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ గెలాక్సీ షూటర్స్ ఫ్రీడమ్ ఫెస్ట్ లో వినియోగదారులు అనేక రివార్డులను పొందుతున్నారు. రివార్డుల జాబితాలో రూ .4,999 రీఛార్జ్ ప్లాన్ కూడా ఉంది. ఈ ఫెస్ట్ లో కంపెనీ కేవలం రూ.1కే రూ.4,999 వార్షిక ప్లాన్ ను వినియోగదారులకు అందిస్తోంది.
ప్లాన్‌లో లభించే బెనిఫిట్స్
రూ.4,999 ప్లాన్లో వీఐ తన వినియోగదారులకు అపరిమిత కాలింగ్‌తో పాటు ప్రతిరోజూ 2 జీబీ మొబైల్ డేటా, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. దీనితో పాటు అపరిమిత 5జీ డేటా కూడా ఈ ప్యాక్ లో లభిస్తుంది. అంతేకాకుండా వీఐఎంటీవీ, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్లో వినియోగదారులకు అర్ధరాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అపరిమిత డేటా లభిస్తుంది. ఇది కాకుండా, వీకెండ్ డేటా రోల్ఓవర్ కూడా ఇందులో లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఏడాది. కేవలం రూ.1కే ఇన్ని బెనిఫిట్స్ పొందొచ్చు.
ఆఫర్ పొందండిలా..
వీఐ యాప్‌ను ఓపెన్ చేయండి
వీఐ గేమ్స్ సెక్షన్‌కి వెళ్లండి
గెలాక్సీ షూటర్స్ ఫ్రీడమ్ ఫెస్ట్ ఎడిషన్ గేమ్ ఆడండి
డ్రోన్లను షూట్ చేసి జెమ్స్ సంపాదించండి
జెమ్స్ ఆధారంగా రివార్డ్స్ పొందండిఎన్ని రివార్డ్స్‌కు ఏమి లభిస్తాయి?
25 జెమ్స్ రివార్డ్స్‌కు రూ.50 అమెజాన్ వోచర్
75 జెమ్స్ రివార్డ్స్‌కు 10జీబీ డేటా + ఓటీటీ యాక్సెస్
150 జెమ్స్ రివార్డ్స్‌కు 50జీబీ డేటా ప్యాక్
300 జెమ్స్ రివార్డ్స్‌కు రూ.1కే రూ.4999 ప్లాన్ (15 మంది విజేతలకు మాత్రమే)