వొడాఫోన్‌-ఐడియా కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. వీఐ మ్యాక్స్‌ ప్లాన్లలో కొత్త ఫీచర్లు | Vi Max Family Postpaid Users Get Data Sharing Unlimited Data for Night | Sakshi
Sakshi News home page

వొడాఫోన్‌-ఐడియా కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. వీఐ మ్యాక్స్‌ ప్లాన్లలో కొత్త ఫీచర్లు

Oct 5 2023 8:03 AM | Updated on Oct 5 2023 8:05 AM

Vi Max Family Postpaid Users Get Data Sharing Unlimited Data for Night - Sakshi

న్యూఢిల్లీ: టెలికం సేవల సంస్థ వీఐ (వొడాఫోన్‌–ఐడియా) కొత్తగా మ్యాక్స్‌ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లలో రెండు కొత్త ఫీచర్లను జోడించింది. డేటా షేరింగ్, నైట్‌ టైమ్‌ అన్‌లిమిటెడ్‌ డేటా వీటిలో ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం కస్టమర్లు ఎంచుకున్న ప్లాన్‌ పరిమితికి మించి 10 జీబీ నుంచి 25 జీబీ వరకు డేటాను అదనంగా పొందవచ్చు.

దీన్ని మిగతా కుటుంబ సభ్యులు కూడా షేర్‌ చేసుకోవచ్చు. ఇక రాత్రి 12 గం. నుంచి ఉదయం 6 గం. వరకు ఉండే నైట్‌ టైమ్‌ అన్‌లిమిటెడ్‌ డేటా ఫీచర్‌ని మ్యాక్స్‌ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లకు కూడా వర్తింపచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. మొత్తం మీద రూ. 601 మ్యాక్స్‌ ఫ్యామిలీ ప్లాన్‌లో 2 కనెక్షన్లతో 120 జీబీ డేటా పొందవచ్చు. అంతకు పైబడిన ప్లాన్లలో 325 జీబీ వరకు పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement