సంక్షోభంలోనూ రికార్డ్‌లు, రూ.6.50 లక్షల కోట్లు దాటిన యూపీఐ పేమెంట్స్‌ | UPI transaction value crosses Rs 6 lakh crore in September | Sakshi
Sakshi News home page

UPI transaction: రూ.6.50 లక్షలకోట్లు దాటిన యూపీఐ పేమెంట్స్‌

Oct 1 2021 1:09 PM | Updated on Oct 1 2021 1:49 PM

UPI transaction value crosses Rs 6 lakh crore in September - Sakshi

కరోనా సంక్షోభంలోనూ దేశంలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ట్రాన్సాక్షన్‌లు సరికొత్త రికార్డ్‌లను క్రియేట్‌ చేస్తున్నాయి. ఈ ఏడాదిలో సెప్టెంబర్‌ నెల ముగిసే సమయానికి యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్ల విలువ రూ.6.50 లక్షల కోట్లకు చేరింది. ఒక్క సెప్టెంబర్‌లోనే రూ.365 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా( ఎన్‌సీపీఐ) ఎండీ దిలీప్‌ అస్బే తెలిపారు.

ఈ సందర్భంగా దిలీప్‌ అస్బే మాట్లాడుతూ..కరోనా వ్యాప్తి , లాక్‌ డౌన్‌ కారణంగా బ్యాంక్‌లకు వెళ్లే అవకాశం లేకపోవడంతో యూపీఐ పేమెంట్స్‌ పెరిగేందుకు దోహదపడిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 2021 జనవరి నెల ప్రారంభ సమయంలో 52 శాతంతో యూపీఐ పేమెంట్స్‌ రూ.4.31లక్షల కోట్లు చేరుకోగా..నెల ముగిసే సమయానికి 58 శాతం పెరిగి  రూ.230కోట్ల మేర యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగినట్లు వెల్లడించారు.

‘యూపీఐ లావాదేవీల విలువ దేశంలో వార్షిక ప్రాతిపదికన రూ.74.34 లక్షల కోట్లు ఉండొచ్చని భావిస్తున్నాం. గతేడాది మొత్తం డిజిటల్‌ పేమెంట్స్‌ సంఖ్య 5,500 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఇది 7,000 కోట్లు ఉండొచ్చు. ఈ వ్యవస్థలో నెలకు 30 కోట్ల యాక్టివ్‌ కస్టమర్లు ఉన్నారని అంచనా. ఇందులో యూపీఐ వాటా 20 కోట్లు. దేశవ్యాప్తంగా 5 కోట్లకుపైగా వర్తకులు డిజిటల్‌ విధానంలో పేమెంట్లు చేస్తున్నట్లు  దిలీప్‌ అస్బే చెప్పారు. 

ప్రారంభంలో అలా.. ఇప్పుడు ఇలా
నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో  ఏప్రిల్‌11,2016 నుంచి యూపీఐ పేమెంట్స్‌ ప్రారంభమయ్యాయి. యూపీఐ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తొలి ప్రారంభ నెల నుంచి ఇప్పటి వరకు భారీ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2016 ఏప్రిల్‌ నెల నుంచి ట్రాన్సాక్షన్లు కోట్లతో ప్రారంభం కాగా 2020 సెప్టెంబర్‌ నెలకు రూ.3 లక్షల కోట్లుకు చేరింది. ఆ నెంబర్‌ డబుల్ త్రిబులై జులై 2021కి రూ.6లక్షల కోట్లతో రికార్డ్‌లను క్రియేట్‌ చేసినట్లు వెలుగులోకి వచ్చిన కొన్ని నివేదికలు చెబుతున్నాయి. 

చదవండి: కార్డు చెల్లింపులు.. ఇవాల్టి నుంచే కొత్త రూల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement