కృత్రిమ మేధస్సు ఆధారిత ఐఓటి ఎకోసిస్టమ్స్‌లో ముందంజలో ఉన్న ట్రైడ్ సంస్థ.. ప్రతిష్టాత్మక టై50‘మోస్ట్ ప్రామిసింగ్ స్టార్టప్స్’ జాబితాలో చోటు దక్కించుకుంది. విమానయాన, ఇంధన, మొబిలిటీ రంగాల్లో విప్లవాత్మక ఆవిష్కరణలకుగాను ఈ గుర్తింపు లభించింది.
విమానయాన రంగంలో చిన్న లోపం కూడా పెద్ద సమస్యకు దారితీస్తుంది. పునరావృతమయ్యే సాంకేతిక లోపాలు లేదా గుర్తించని లోపాలు విమానాలను నేలమట్టం చేయగలవు, భారీ ఆర్థిక నష్టం కలిగించగలవు, అలాగే కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు ముప్పు కలిగించగలవు. ఈ సవాళ్లను డేటా సాంకేతికతో పరిష్కరించడమే ట్రైడ్ ప్రధాన లక్ష్యం.
ట్రైడ్ అభివృద్ధి చేసిన డేటా-ఇంటెలిజెంట్ ప్లాట్‌ఫారమ్ వివిధ విమానయాన, మొబిలిటీ వ్యవస్థలను అనుసంధానం చేసి, సంస్థలు మరింత సమర్థవంతమైన, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. విమానాశ్రయ డిజిటలైజేషన్, ఏఐ ఆధారిత లోపాల నిర్వహణ, విమాన సంస్థల్లో దీర్ఘకాలిక లోపాల పరిష్కారాలు వంటి ఆవిష్కరణల ద్వారా ట్రైడ్ విమానయాన రంగంలో విశ్వసనీయత, సామర్థ్యం, భద్రతలో కొత్త ప్రమాణాలను స్థాపిస్తోంది.
ఆసియాలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ట్రైడ్.. ఇప్పుడు మధ్యప్రాచ్య దేశాలకు, యూరప్ వైపు విస్తరిస్తోంది. ట్రైడ్ పరిష్కారాలు సంస్థలకు ప్రీడిక్టివ్ ఇన్‌సైట్స్, సస్టైనబుల్ పనితీరు, రియల్‌టైమ్ నిర్ణయ మద్దతు అందించి ప్రతిరోజూ లక్షలాది జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి.


