హైదరాబాద్‌లో ఎదుగుతున్న ఈ కంపెనీలు బెస్ట్‌: లింక్డ్ఇన్ లిస్ట్‌ | LinkedIn Top Startups 2025 Hyderabad: Skyroot Aerospace tops list, Recykal 2nd | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఎదుగుతున్న ఈ కంపెనీలు బెస్ట్‌: లింక్డ్ఇన్ లిస్ట్‌

Oct 31 2025 11:48 AM | Updated on Oct 31 2025 12:13 PM

Top Startups in Hyderabad 2025 LinkedIn list

హైదరాబాద్: అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ లింక్డ్ఇన్ హైదరాబాద్‌లో 2025 గానూ టాప్ స్టార్టప్‌ల జాబితాను విడుదల చేసింది. కెరీర్‌లు వృద్ధి చెందగల, అభివృద్ధి చెందుతున్న కంపెనీల వార్షిక ర్యాంకింగ్ ఇది. ఉద్యోగుల ఎదుగుదల, అనుసంధానిత ఆసక్తి, ఉద్యోగ ఆసక్తి , అగ్రశ్రేణి ప్రతిభావంతుల ఆకర్షణపై ప్రత్యేకమైన లింక్డ్ఇన్ డేటా ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.

ఏరోస్పేస్ మార్గదర్శి స్కైరూట్ ఏరోస్పేస్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా ఆ తరువాత రీసైక్లింగ్ ప్లాట్‌ఫామ్ రీసైకల్, సాస్‌ సంస్థ స్వైప్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ టాప్‌ 10 జాబితాలో ఈసారి ఏడు సంస్థలు కొత్తగా ప్రవేశించాయి. వైవిధ్యమైన ఆవిష్కరణ కేంద్రంగా హైదరాబాద్  ఎంత వేగంగా ఎదుగుతోందో ఈ జాబితాను బట్టి తెలుస్తోంది.

హైదరాబాద్‌లో 2025 టాప్ స్టార్టప్‌లు ఇవే..

ర్యాంక్‌స్టార్టప్‌ పేరు
1స్కైరూట్ ఏరోస్పేస్
2రీసైకిల్
3స్వైప్
4జెహ్ ఏరోస్పేస్
5విజెన్ లైఫ్ సైన్సెస్
6క్రెడ్జెనిక్స్
7ఫ్రంట్లైన్స్ ఎడ్యుటెక్
8భాంజు
9లిక్విడ్నిట్రో గేమ్స్
10కోస్కూల్

లింక్డ్‌ఇన్ లిస్ట్‌లోని టాప్ స్టార్టప్‌ కంపెనీలలో ఉద్యోగం ఎలా పొందాలో లింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్‌పర్ట్ , లింక్డ్ఇన్ ఇండియా న్యూస్ సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నీరాజిత బెనర్జీ అందిస్తోన్న కొన్ని  చిట్కాలు..

ఏ కంపెనీలు ఉద్యోగాలిస్తున్నాయని మాత్రమే కాకుండా.. స్టార్టప్‌ల విస్తరణను కూడా ట్రాక్ చేయాలి. ఎందుకంటే రెండేళ్లలోనే 14 కొత్త సంస్థలు జాతీయ స్థాయికి ఎదిగాయి. దీన్ని ఉద్యోగ బోర్డులలో చూడలేరు. ముందుగానే ఊపును గుర్తించడానికి నిధులు, ఉత్పత్తి ఆవిష్కరణలు, మార్కెట్ విస్తరణను గమనించాలి.

భవిష్యత్ ఎంట్రాప్రెన్యూర్‌షిష్‌కు అవకాశాలను అంచనా వేయాలి. అధిక-వృద్ధి చెందుతున్న స్టార్టప్‌లలో నాయకత్వం మీ వృద్ధిని టైటిల్ కంటే ఎక్కువగా నిర్దేశిస్తుంది. ఎంట్రాప్రెన్యూర్‌లు టీమ్స్‌ను ఎలా నిర్మిస్తారు.. కమ్యూనికేట్ చేస్తారు.. ప్రతిభను నిలుపుకుంటారు అని చూడటానికి లింక్డ్‌ఇన్‌ని ఉపయోగించండి. హైప్ కంటే నమ్మకం, స్పష్టత ముఖ్యమైనవి.

కేవలం ఆవిష్కరణలతో కాకుండా క్రమశిక్షణతో కూడిన వ్యాపార నమూనాల కోసం చూడాలి. ఈ సంవత్సరం అగ్రశ్రేణి స్టార్టప్‌లు ఆవిష్కరణలను అమలుతో జత చేయడం ద్వారా విజయాన్ని అందుకుంటున్నాయి. క్విక్‌ కామర్స్‌ కొత్త వర్గాలలోకి ప్రవేశిస్తోంది. ఏఐ మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్నాయి. ఫిన్‌టెక్ రంగం మరింత అభివృద్ధి చెందుతోంది.

సమస్యా పరిష్కారాలకు ప్రాధాన్యత ఉన్న రంగాలు, సంస్థల దృష్టి సారించాలి. ఈ సంవత్సరం అగ్రశ్రేణి స్టార్టప్‌లు ప్రాబ్లమ్‌ సొల్యూషన్స్‌పైనే దృష్టి సారించి ముందుకెళ్తున్నాయి. ఆ కంపెనీలు నిమగ్నమై ఉన్న సమస్యను మీరు అర్థం చేసుకుంటే, ఎల్లప్పుడూ రిలేటెడ్‌గా ఉండేందుకు అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement