పుంజుకున్న టైటాన్‌

Titan reports net profit of Rs 61 crore for quarter ended June - Sakshi

జూన్‌ క్వార్టర్‌లో రూ.18 కోట్ల లాభం

న్యూఢిల్లీ: టాటా గ్రూపులో భాగమైన టైటాన్‌ కంపెనీ 2021–22 జూన్‌ త్రైమాసికంలో తన పనితీరును మెరుగుపరుచుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ.297 కోట్లు నష్టపోగా.. తాజాగా ముగిసిన త్రైమాసికంలో రూ.18 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.3,519 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.2,020 కోట్లుగా ఉంది. టైటాన్‌ ఆభరణాల విభాగం మంచి పనితీరును చూపించినట్టు సంస్థ ప్రకటించింది. ఈ విభాగం ఆదాయం రూ.1,182 కోట్ల నుంచి రూ.2,467 కోట్లకు వృద్ధి చెందింది. వాచ్‌లు, వేరబుల్‌ ఉత్పత్తుల నుంచి ఆదాయం రూ.292 కోట్లకు పుంజుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఈ విభాగం ఆదాయం రూ.75 కోట్లుగానే ఉండడం గమనార్హం. అలాగే, కళ్లద్దాల వ్యాపార ఆదాయం రూ.30 కోట్ల నుంచి రూ.67 కోట్లకు మెరుగుపడగా.. ఇతర ఉత్పత్తుల నుంచి వచ్చిన ఆదాయం రూ.14 కోట్లుగా నమోదైంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top