వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక 60 కిలోమీటర్ల వరకు నో టోల్!

There Will Be Only One Toll Collection Within 60 KM Distance: Nitin Gadkari - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త తెలిపింది. జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల లోపు ఉన్న టోల్ కలెక్టింగ్ పాయింట్లను వచ్చే మూడు నెలల్లో మూసివేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభలో ప్రకటించారు. 2022-23 బడ్జెట్‌లో కేటాయించిన రోడ్లు, రహదారుల కేటాయింపుపై లోక్ సభలో జరిగిన చర్చకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ.. 60 కిలోమీటర్ల పరిధిలో ఒకే ఒక్క టోల్ గెట్ ఉంటుందని ప్రకటించారు.

ఇంకా భవిష్యత్ నిర్మాణం జరగబోయే రోడ్ల గురించి ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ-అమృత్ సర్-కత్రా ఎక్స్ ప్రెస్ వేను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ-అమృత్ సర్ మార్గం ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుంది అని అన్నారు. అలాగే, కొత్తగా నిర్మిస్తున్న మార్గం వల్ల ఢిల్లీ నుంచి అమృత్ సర్ చేరుకోవడానికి 4 గంటల సమయం మాత్రమే పడుతుందని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న వల్ల శ్రీనగర్ నుంచి ముంబై చేరుకోవడానికి 20 గంటల సమయం పడుతుందని గడ్కరీ చెప్పారు.

"కొత్తగా నిర్మిస్తున్న జమ్మూ-శ్రీనగర్ హైవేను ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను" అని అన్నారు. అలాగే ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేలు కూడా ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయి తెలిపారు. ఢిల్లీ-ముంబై దూరాన్ని 12 గంటల్లోపు కారులో చేరుకోవచ్చు. 2024 నాటికి శ్రీనగర్-లేహ్ హైవేపై సముద్ర మట్టానికి 11,650 అడుగుల ఎత్తులో ఉన్న జోజిలా పాస్ సొరంగాన్ని తెరవాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే, రోడ్డు భద్రతపై మంత్రి మాట్లాడుతూ.. ఇప్పుడు అన్ని కార్లలో 6 ఎయిర్ బ్యాగులతో తప్పనిసరిగా ఉండాలని అన్నారు. 

(చదవండి: బంగారం కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ధరలు!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top