కర్ణాటకలో టెస్లా ప్లాంట్

Tesla Will Open Manufacturing Unit In Karnataka - Sakshi

బెంగళూరు: ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. గతంలో బిల్ గేట్స్ కంప్యూటర్ రంగంలో సృష్టించిన సంచలనాలను ఇప్పుడు ఎలన్ మస్క్ ఇతర రంగాల్లో సాధిస్తున్నారు. ఆయనకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇతర దిగ్గజ ఆటోమొబైల్ తయారీ కంపెనీలకు దీటుగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ అమ్ముడుపోతున్న కార్లు టెస్లా కంపెనీకి చెందినవే. అలాంటి కారు తయారీ కంపెనీ మన భారత్ లో కూడా ప్లాంట్ పెట్టేందుకు సిద్ధమైంది.

ఇప్పటికే తమ హెడ్ క్వార్టర్‌గా బెంగళూరును ఎంచుకున్న టెస్లా. ఇప్పుడు ప్లాంట్ ను కూడా బెంగళూరు దగ్గరలోని తుంకూర్ జిల్లాలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు కర్ణాటక సీఎం యడ్యూరప్ప అధికారిక ప్రకటన చేశారు. టెస్లా ప్లాంట్ నిర్మాణం, కార్ల అభివృద్ధి కోసం 7,725 కోట్లను కూడా కేటాయించినట్లు పేర్కొన్నారు. టెస్లా మోటార్స్ ఇండియా జనవరి 8న టెస్లా ఆర్&డి విభాగాన్ని బెంగళూరులో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థకు డైరెక్టర్ లలో ఒకరిగా డేవిడ్ ఫెనిస్టియన్ పేరును కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఆయన టెస్లాలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా విధులను నిర్వహిస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటిగా టెస్లా మోడల్ 3 సెడాన్ అమ్మకానికి తీసుకొనిరావడానికి చూస్టున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ఈ మోడల్ 3 ధర 38వేల డాలర్లుగా ఉంది.

చదవండి:

ప్రపంచంలో చవకైన ఎలక్ట్రిక్ వాహనం

సెంచరీ కొట్టిన పెట్రోల్ ధరలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top