టెస్లా నుంచి మరో కొత్త కారు.. ఇదే అత్యంత చౌక | tesla launches 2026 model y premium india price rs 50 89 lakh | Sakshi
Sakshi News home page

టెస్లా నుంచి మరో కొత్త కారు.. ఇదే అత్యంత చౌక

May 30 2026 6:21 PM | Updated on May 30 2026 6:46 PM

tesla launches 2026 model y premium india price rs 50 89 lakh

న్యూఢిల్లీ: అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా శుక్రవారం భారత్‌లో ‘2026 మోడల్‌ వై ప్రీమియం’ (రియర్‌ వీల్‌ డ్రైవ్‌) వేరియంట్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూమ్‌ ధరను రూ.50.89 లక్షలుగా నిర్ణయించింది. దేశీయ మార్కెట్లో ఇప్పటివరకు విడుదలైన టెస్లా కార్లలో ఇదే అత్యంత చౌకైనది.

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఈవీ ‘మోడల్‌ వై’ ఆధారంగా రూపొందించిన ఈ కొత్త వేరియంట్‌లో పలు హార్డ్‌వేర్‌ అప్‌గ్రేడ్‌లు, మెరుగైన ఇంటీరియర్‌ ఫీచర్లు ఉన్నాయి. ఒకసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. సున్నా నుంచి 100 కి.మి. వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది.

డెలివరీలు జూలై నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు మరిన్ని షోరూమ్‌లు, సరీ్వస్‌ సెంటర్లు, చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పా టుకు పెట్టుబడులు కొనసాగిస్తామని టెస్లా సీనియర్‌ డైరెక్టర్‌ ఇసాబెల్‌ ఫాన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement