ఉద్యోగులకు టీసీఎస్‌ షాక్‌!

Tcs End Work From Home Asking Employees To Rejoin The Office By November 15 This Year - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్‌ కారణంగా సుధీర్ఘకాలంగా వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్న ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని మెయిల్స్‌ పెట్టింది.  

ఈ ఏడాది నవంబర్‌ 15 నుంచి ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు తిరిగి కార్యాలయాల నుంచి విధులు నిర్వహించాలని సూచించింది. కోవిడ్‌-19 ప్రారంభం నుంచి రిమోట్‌ వర్క్‌ చేసుకునేలా ఉద్యోగులకు అనుమతిచ్చింది. ఈ తరుణంలో కోవిడ్‌ తగ్గుముఖం పట్టి యధావిధిగా కార్యకాలపాలు కొనసాగుతుండడంతో.. వర్క్‌ ఫ్రం హోమ్‌కు గుడ్‌ బై చెప్పాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని స్పష్టం చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న ప్రతి ఉద్యోగి తప్పని సరిగా ఆఫీస్‌కు రావాలని చెప్పింది. అదే సమయంలో 95 శాతానికి పైగా పాక్షికంగా, 70శాతం పైగా ఉద్యోగులు పూర్తిస్థాయిలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారని టీసీఎస్‌ సీఈవో రాజేష్‌ గోపినాధన్‌ తెలిపారు.ప్రస్తుతం 20 నుంచి 25శాతం ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోమ్‌కు స్వస్తి చెప్పి ఆఫీస్‌కు వస్తున్నారు. రిటర్న్‌ టూ ఆఫీస్‌ మోడల్‌ను అమలు చేస్తున్నాం. తద్వారా 25/25 ప్లాన్‌ను మరింత నియంత్రిత పద్ధతిలో అమలు చేయాలి' అని తెలిపారు.  

కాగా, ఇంటి వద్ద నుంచి వర్క్‌ చేస్తున్న ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేలా ప్రోత్సహించేందుకు టీసీఎస్‌ వేరియబుల్‌ పే విధానాన్ని వినియోగించుకుంటుంది. మిగిలిన టెక్‌ కంపెనీలతో సంబంధం లేకుండా ఉద్యోగులకు చెల్లించే వేరియబుల్స్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని తాజాగా స్పష్టం చేసింది.

చదవండి👉 వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ !! రండి.. రండి.. దయచేయండి.. ఉద్యోగుల‌కు టెక్ కంపెనీల పిలుపు!!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top