మహిళా ఇంజనీర్లకు టాటా టెక్నాలజీస్‌ ప్రాధాన్యం.. కొత్తగా 1000 ఉద్యోగాలు

Tata Technologies to hire 1000 women engineers - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఇంజనీరింగ్, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ డిజిటల్‌ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్‌ మరింత మంది మహిళలను రిక్రూట్‌ చేసుకోవాలని భావిస్తోంది. కార్యాలయాల్లో లింగ వైవిధ్యాన్ని పాటించే  క్రమంలో ’రెయిన్‌బో’ కార్యక్రమం కింద 2023–24 ఆర్థిక సంవత్సరంలో 1,000 మంది పైగా మహిళా ఇంజనీర్లను తీసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది.

అలాగే, నాయకత్వ బాధ్యతలను చేపట్టేలా మహిళా ఉద్యోగులను తీర్చిదిద్దే దిశగా ఆరు నెలల లీడర్‌బ్రిడ్జ్‌–వింగ్స్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు వివరించింది. ఉద్యోగినులు నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని టాటా టెక్నాలజీస్‌ వివరించింది. సంస్థలో సమ్మిళిత సంస్కృతిని పెంపొందించేందుకు, ఉద్యోగులు చురుగ్గా పాలుపంచుకునేందుకు మరిన్ని కొత్త ప్లాట్‌ఫామ్‌లను కూడా ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top