అదిరిపోతున్న టాటా మోటార్స్ ఆఫర్లు, ఈ కార్లపై భారీ తగ్గింపు!

Tata Motors Diwali Offers: Discounts Up To Rs 40000 On Various Car Models - Sakshi

పండుగ సీజన్‌ వస్తూ వస్తూ దాని వెంట డిస్కౌంట్లు, ఆఫర్లను కూడా తీసుకువస్తుంది. అందులో దసరా, దీపావళి సీజన్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. ఇప్పటికే కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు బోలెడు ఆఫర్లతో ప్రకటిస్తున్నాయి. తాజాగా పండుగ సందర్భంగా కొత్త కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్ చెప్పింది దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ (TATA Motors). టాటా మోటార్స్ వివిధ కార్లపై బెస్ట్ ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ నెలలో తమ కంపెనీ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 40,000 వరకు బెనిఫిట్స్ ఇస్తున్నట్లు తెలిపింది. డిస్కౌంట్లు ప్రకటించిన కార్ల మోడళ్లపై ఓ లుక్కేద్దాం!

 టాటా టియాగో (TATA Tiago)
టాటా టిగోర్ కొనుగోలుపై రూ. 20,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కొనుగోలుదారులు రూ. 10,000 ఎక్స్చేంజ్ బెనిఫిట్, రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ కారులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌.. 86PS వపర్‌ను, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా టిగోర్ CNG (TATA tigor CNG)
ఈ నెలలో టాటా టిగోర్ CNG కారును కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 25,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. వీటిలో క్యాష్ డిస్కౌంట్ రూ. 10,000, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ రూ. 15,000గా ఉంది. ఈ కారులోని 1.2-లీటర్ ఇంజిన్ 73PS పవర్, 95Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా హారియర్(Tata Harrier)
టాటా హారియర్ అన్ని టాటా కార్లలో అధికంగా తగ్గింపును ప్రకటించింది. తాజా సేల్‌లో ఈ SUVపై కస్టమర్లు రూ. 40,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్చేంజ్ బెనిఫిట్‌తో కలిసి ఈ మేరకు ధర తగ్గుతుంది. ఇంజన్ విషయానికి వస్తే, టాటా హారియర్ 2.0 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజన్ (1956cc), గరిష్ట 350Nm టార్క్‌, 170PS పవర్‌ని విడుదల చేస్తుంది. SUV బూట్ స్పేస్ 425 లీటర్లు కాగా, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 50 లీటర్లుగా ఉంది.

టాటా సఫారి(Tata Safari)
టాటా సఫారీని రూ. 40,000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్ ఆఫర్‌లో రూ. 40,000 ఎక్స్ఛేంజ్ తగ్గింపు ఉంటుంది. అయితే, టాటా అందించే ఈ అత్యంత ప్రీమియం SUVపై ఎలాంటి క్యాష్ డిస్కౌంట్ లేదు. టాటా సఫారి 2.0-లీటర్, టర్బో-డీజిల్ ఇంజన్‌తో 170 PS పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా: ఆనంద్‌ మహీంద్ర కొత్త కారు నిక్‌నేమ్‌ ‘భీమ్‌’కే ఓటు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top