
న్యూఢిల్లీ: ఈక్వల్–వన్మనీ సంస్థతో కలిసి టాటా మ్యుచువల్ ఫండ్ యాప్‌లో పోర్ట్‌ఫోలియో 360 ఫీచరును ప్రవేశపెట్టినట్లు టాటా అసెట్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025 సందర్భంగా దీన్ని ఆవిష్కరించింది. వివిధ బ్యాంకు ఖాతాలు, ఫండ్స్, ఈక్విటీలు, ఎఫ్‌డీలు మొదలైన వాటి వివరాలన్నీ ఒకే దగ్గర చూసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ సీఈవో ప్రతీత్ భోబె తెలిపారు.
రిటైర్మెంట్‌లాంటి ఆర్థిక ప్రణాళికలు వేసుకునేందుకు ఇన్వెస్టర్లకి సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రవేశపెట్టిన కొద్ది నెలల్లోనే టాటా మ్యుచువల్ ఫండ్ యాప్ డౌన్‌లోడ్‌లు 6 లక్షల పైగా నమోదైనట్లు వివరించారు. పారదర్శకత, ఆవిష్కరణలపరంగా అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ పోర్ట్‌ఫోలియో 360ని తీర్చిదిద్దినట్లు ఈక్వల్–వన్మనీ వ్యవస్థాపకుడు కృష్ణ ప్రసాద్ తెలిపారు.