క్రూడ్‌ఆయిల్‌తో ఇవి తయారీ..

Surprising Products Made from Crude Oil - Sakshi

అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల వల్ల క్రూడ్‌ ఆయిల్‌ ధర పెరుగుతోంది. కొన్నిసార్లు స్వల్పంగా తగ్గినా మరికొన్ని పరిస్థితుల వల్ల తిరిగి ధరలు పెంచుతున్నారు. దేశంలో వినియోగించే క్రూడ్‌లో అధికభాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకునేదే. అయితే దేశీయంగా ఈ కింది రాష్ట్రాల్లో అధికంగా క్రూడ్‌ఆయిల్‌ ఉత్పత్తి అవుతోంది.

 • రాజస్థాన్‌-7667 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు (ఎంఎంటీ)
 • గుజరాత్‌-4626 ఎంఎంటీ
 • అసోం-4309 ఎంఎంటీ
 • తమిళనాడు-395 ఎంఎంటీ
 • ఆంధ్రప్రదేశ్‌-296 ఎంఎంటీ

అరుణాచల్‌ప్రదేశ్‌-43 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి అవుతోంది. మొత్తం ఆన్‌షోర్‌(భూ అంతరాల్లో నుంచి వెలికితీసే ఆయిల్‌) ఉత్పత్తిలో 17336 ఎంఎంటీ, పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లతో ప్రైవేట్‌ కంపెనీలు జాయింట్‌ వెంచర్‌గా ఏర్పాటై 9367 ఎంఎంటీ క్రూడ్‌ ఆయిల్‌ను వెలికి తీస్తున్నాయి. పూర్తి ప్రైవేట్‌ కంపెనీలు 7969 ఎంఎంటీల క్రూడ్‌ ఆయిల్‌ను బయటికి తీస్తున్నాయి. పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్‌లతో జాయింట్‌ వెంచర్‌ ద్వారా ఆఫ్‌షోర్‌(సముద్రం అడుగు నుంచి వెలికితేసే ఆయిల్‌)  ప్రొడక్షన్‌లో భాగంగా 14,969 ఎంఎంటీలు, ప్రైవేట్‌ జాయింట్‌ వెంచర్‌ ద్వారా 1,899 ఎంఎంటీ క్రూడ్‌ ఆయిల్‌ వెలికితీస్తున్నారు. 

ఇదీ చదవండి: టెక్‌ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వారికే..

అయితే క్రూడ్‌ఆయిల్‌ ఎన్నో రంగాల్లోని ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగపడుతోంది. ఆయా రంగాల్లో క్రూడ్‌ ఆయిల్‌ వినియోగించి తయారుచేస్తున్న ఉత్పత్తులు ఈ కింది విధంగా ఉన్నాయి.

 • ఫ్యుయెల్‌: గ్యాసోలిన్‌, డీజిల్‌, జెట్‌ ఫ్యుయెల్‌, పెట్రోల్‌.
 • ప్లాస్టిక్‌​: బాటిళ్లు, కంటైనర్లు, టాయ్స్‌.
 • కాస్మాటిక్స్‌: లోషన్లు, ఫెర్ఫ్యూమ్‌, డీయోడరెంట్లు.
 • మెడిసిన్లు: ఆస్పరిన్‌, యంటీసెప్టిక్స్‌, సిరంజీలు.
 • ఎలక్ట్రానిక్స్‌: ఇన్సులేటర్లు, కంపోనెంట్లు.
 • వస్త్రరంగం: పాలీస్టర్‌, నైలాన్‌, ఆక్రిలిక్‌.
 • గృహోపకరణాలు: డిటర్జెంట్లు, క్యాండిళ్లు.
 • రియల్టీ: ఆస్పాల్ట్‌, పైపులు, స్విచ్‌లు.
 • వ్యవసాయం: కృత్రిమ ఎరువులు, ఫెస్టిసైడ్స్‌.
 • ల్యూబ్రికెంట్లు: మోటార్‌ ఆయిల్‌, గ్రిజ్‌
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top