ChatGPT: ప్రపంచ దేశాలు పొగిడేస్తున్నాయ్.. స్టూడెంట్స్‌తో పోటీపడలేకపోతోంది

Students beat chatgpt in accounting exam - Sakshi

ప్రపంచంలోని చాలా దేశాలు చాట్‌జీపీటీ చేయాలేని పనే లేదని, దానికి తిరుగే లేదని చెబుతున్నాయి. అయితే ఇండియాలో మాత్రం చాట్‌జీపీటీ పర్ఫామెన్స్ చాలా పూర్‌గా ఉన్నట్లు కొన్ని సంఘటన ద్వారా తెలుస్తోంది. గతంలో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఫెయిల్ అయిన చాట్‌జీపీటీ మరో సారి అకౌంటింగ్‌కి సంబంధించిన పరీక్షలో ఉత్తమ పర్ఫామెన్స్ కనపరచలేకపోయింది.

నివేదికల ప్రకారం చాట్‌జీపీటీ ఒక అకౌంటింగ్ పరీక్షలో విద్యార్థుల కన్నా తక్కువ మార్కులు తెచ్చుకోవడం సంచలనంగా మారింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే చాట్‌బాట్ చాట్‌జీపీటీ మంచి పనితీరుని కనపరుస్తుందని అమెరికా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.

అన్నింటా అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్న చాట్‌జీపీటీ ఇండియాలో బొక్కబోర్లా పడింది. అకౌంటింగ్‌కి సంబంధించిన పరీక్షను చాట్‌జీపీటీకి, విద్యార్థులకు వేరు వేరుగా నిర్వహించారు. అయితే ఇందులో చాట్‌జీపీటీ విద్యార్థులకంటే తక్కువ స్కోర్ చేయడం గమనార్హం. విద్యార్థులు 76.7% స్కోర్ చేయగా, చాట్‌జీపీటీ 47.4% మార్కులను మాత్రమే సాధించింది.

(ఇదీ చదవండి: భారత్‌లో చీప్ అండ్ బెస్ట్ డీజిల్ కార్లు - మహీంద్రా బొలెరో నుంచి టాటా నెక్సాన్ వరకు..)

అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఆడిటింగ్ సబ్జెక్టుల్లో చాట్‌జీపీటీ మెరుగైన మార్కులు సాధించిన చాట్‌జీపీటీ టాక్స్, ఫైనాన్షియల్, మేనేజీరియల్ అసెస్ మెంట్ వంటి వాటిలో పూర్ పర్ఫామెన్స్ చూపించింది. షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు, విశ్లేషణాత్మక ప్రశ్నల విషయంలో కూడా చాట్‌జీపీటీ అంతంత మాత్రంగానే ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top