మైక్రోసాఫ్ట్‌ సరికొత్త వ్యూహం.. ఇక ఖాతాలకు పాస్‌వర్డ్ అవసరం లేదు!

Stop using passwords now, Know how to go passwordless - Sakshi

ప్రస్తుత స్మార్ట్ యుగంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. నెటిజన్లు రోజులో కనీసం 4-5 గంటలు ఆన్‌లైన్‌లోనే గడిపేస్తున్నారు అంటే మనం అర్ధం చేసుకోవచ్చు, మనం ఎంత విపరీతంగా ఇంటర్నెట్ వాడుతున్నాము అనేది. అయితే, ఈ ఇంటర్నెట్ వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. మన డేటాను రక్షించుకోవడం కోసం ప్రతి ఖాతాకు పాస్‌వర్డ్ పెట్టుకుంటున్నాం అనే విషయం అందరికీ తేలిసిందే. ఇలా, పెట్టుకున్న ఖాతా వల్ల మన డేటాకు ఎంత వరకు భద్రత లభిస్తుంది అంటే ఎవరు చెప్పలేము.    

ఏటా 18 వందల కోట్ల పాస్‌వర్డ్‌లపై దాడులు
కొన్ని సార్లు డేటాను క్లిష్టమైన పాస్‌వర్డ్  పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పాస్‌వర్డ్లు ఒక్కోసారి గురుణచుకోవడం కష్టం. హ్యాకింగ్ భారీ నుంచి తప్పించుకోవడానికి తరచుగా పాస్‌వర్డ్ మార్చాల్సి ఉంటుంది. అలా చాలా తక్కువ మంది మాత్రమే క్రమం తప్పకుండా పాస్‌వర్డ్ మారుస్తూ ఉంటారు. మనం ఎంత బలమైన పాస్‌వర్డ్‌ను ఏర్పాటుచేసిన హ్యాకర్లు వాటిని సులువుగా ట్రేస్‌ చేసి ఆయా వ్యక్తులు సమాచారాన్ని లాగేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకానోక సందర్భంలో ప్రతి సెకనుకు 579పాస్‌వర్డ్‌లపై హ్యాకర్లు దాడి చేస్తోన్నట్లు మైక్రోసాఫ్ట్‌ ఒక నివేదికలో పేర్కొంది. ఒక ఏడాది చూసుకుంటే మొత్తంగా 18 వందల కోట్ల పాస్‌వర్డ్‌లపై దాడులు జరుగుతున్నాయి.  

ఇక నో పాస్‌వర్డ్
మన సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాలకు పాస్‌వర్డ్ పెట్టుకుంటే ఒక భాద, పెట్టుకోకపోతే ఒక భాద. మైక్రోసాఫ్ట్ ఒక బ్లాగ్ పోస్ట్ ప్రకారం, ఖాతాలకు పాస్‌వర్డ్ కాకుండా మరో ప్రత్యామ్నాయం అవసరమా అంటే, ప్రతి ఐదుగురిలో ఒకరు "అవును" అని సమాధానం అని ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ ఈ  పాస్‌వర్డ్ కష్టాలు, హ్యాకింగ్ భాదల నుంచి తప్పించుకోవడానికి ఒక సరికొత్త వ్యూహాన్ని రచించింది. ఇకపై పాస్‌వర్డ్స్‌లేకుండా మైక్రోసాఫ్ట్‌ యాప్స్‌లో, ఖాతాలో లాగిన్‌ అయ్యేలా మైక్రోసాఫ్ట్‌ దృష్టిసారించింది. పాస్‌వర్డ్స్‌లకు స్వస్తి పలుకుతూ మైక్రోసాఫ్ట్‌ అథేంటికేటర్ యాప్, విండోస్‌ హలో​, లేదా వెరిఫికేషన్‌ కోడ్‌ ద్వారా లాగిన్‌ అయ్యే విధానాలను మైక్రోసాఫ్ట్‌ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. 

(చదవండి: ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ప్రపంచ దేశాలు గజగజ..! వారికి మాత్రం కాసుల వర్షమే..!)

ఈ లాగిన్‌ ఫీచర్‌ విధానంతో మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన యాప్స్‌కు వర్తించేలా చేయనుంది. అందులో అవుట్ లుక్ ,వన్‌డ్రైవ్‌ , మైక్రోసాఫ్ట్‌ ఫ్యామిలీ సెఫ్టీ, ఇతర మైక్రోసాఫ్ట్‌ యాప్స్‌కు ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. పాస్‌వర్డ్స్‌ లేకుంగా లాగిన్‌ అయ్యే ఫీచర్‌ను 2019లో విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో కమర్షియల్‌ యూజర్స్‌ కోసం మైక్రోసాఫ్ట్‌ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ అకౌంట్‌ యూజర్లు యూజర్లు అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ ఆప్షన్‌లో, అడిషనల్‌ సెక్యూరిటీ ఆప్షన్స్‌లో పాస్‌వర్డ్‌​లెస్‌ అకౌంట్‌ ఆప్షన్‌ను టర్నఆన్‌ చేయడం ద్వారా మైక్రోసాఫ్ట్‌ అథేంటికేటర్ యాప్స్‌ నుంచి వచ్చే ఆన్‌స్క్రీన్‌ ప్రామ్ట్స్'తో లాగిన్‌ అవ్వచును. ఈ ఫీచర్‌ ప్రస్తుతం కమర్షియల్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. 

మైక్రోసాఫ్ట్‌ అథెంటికేటర్‌ యాప్‌ వాడటం ఎలా?

  • మైక్రోసాఫ్ట్‌ అథెంటికేటర్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత యూజర్స్‌ తమ ఖాతాలను పాస్‌వర్డ్‌లెస్‌కి మార్చుకోవచ్చు. 
  • ముందుగా మీ ఖాతాని అథెంటికేటర్‌ యాప్‌తో అనుసంధానించాలి. 
  • తర్వాత మీ మైక్రోసాఫ్ట్‌ ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీలో పాస్‌వర్డ్‌లెస్‌ అష్షన్‌ని ఎనేబుల్‌ చేసుకోవాలి. 
  • ఇప్పుడు అథెంటీకేటర్‌ యాప్‌లో వచ్చే నోటిఫికేషన్లను ఓకే చేస్తూ మీ ఖాతాలోకి లాగిన్‌ కావచ్చు. 
  • ఒకవేళ మీరు తిరిగి పాస్‌వర్డ్‌ కావాలనుకుంటే ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి పాస్‌వర్డ్‌లెస్‌ అష్షన్‌ని డిసేబుల్‌ చేస్తే సరిపోతుంది. 

అయితే పాస్‌వర్డ్‌తో కంటే పాస్‌వర్డ్‌లెస్‌తోనే ఆన్‌లైన్‌ ఖాతాలకు ఎక్కువ భద్రత ఉంటుందని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే గూగుల్‌, యాపిల్‌ వంటి కంపెనీలు కూడా పాస్‌వర్డ్‌కి బదులు అథెంటికేషన్‌ ద్వారా లాగిన్‌ అయ్యే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే వీటిని ఉపయోగించలా? వద్దా? అనే నిర్ణయాన్ని వినియోగదారులకు ఇచ్చాయి.

(చదవండి: Moto G31: మోటోరోలా నుంచి మరో శక్తి వంతమైన స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ అదుర్స్!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top