మీరు మీమ్స్‌ చేస్తారా? ఈ ఉద్యోగం మీ కోసమే.. లక్షల్లో ప్యాకేజీ కూడా!

Stockgro Looking For Chief Meme Officer At A Salary Of Rs 1 Lakh A Month - Sakshi

మీమ్స్‌!.. సీరియస్‌ విషయాన్ని ఎవ్వరి మనోభావాల్ని నొప్పించకుండా సున్నితంగా నవ్వు పుట్టించేలా చెప్పడమే. అలా మీమ్స్‌ చేసే టాలెంట్‌ ఉంటే మీలో ఉందా? కాలు కదపకుండా ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించవచ్చు. లేదంటే ఆఫీస్‌లో కూర్చొని ఐటీ ఉద్యోగుల జీతాలకు ఏమాత్రం తీసిపోకుండా మీమ్స్‌ చేసుకుంటూ భారీ శాలరీ ప్యాకేజీ తీసుకోవచ్చు. ఆశ్చర్య పోతున్నారా? లేదంటే నమ్మబుద్ధి కావడం లేదా?  

పెరిగిపోతున్న సోషల్‌ మీడియా వినియోగంతో మీమ్స్‌ ద్వారా ఎక్కువ మందిని చేరడం చిటికెలో సాధ్యం. అందుకే పలు పేరొందిన కంపెనీలు కూడా మీమ్స్‌ని తమ బ్రాండింగ్‌కి వాడుకుంటున్నాయి. ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా ఇప్పుడున్న ప్రధాన వేదికలు. యూజర్ల దృష్టిని ఆకట్టుకునేలా మీమ్స్‌ని క్రియేట్‌ చేసి పోస్ట్‌ చేస్తే చాలు. అవి వైరల్‌ అవుతూ సంస్థలకు కావాల్సినంత పబ్లిసిటీ అవుతుంది. 

అందుకే బెంగళూరుకు చెందిన స్టాక్‌గ్రో అనే సంస్థ మీమ్స్‌ తయారు చేసే మీమర్స్‌కు బంపరాఫర్‌ ఇచ్చింది. చీఫ్‌ మీమ్‌ ఆఫీసర్‌కు నెలకు రూ.లక్ష శాలరీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. ఫైనాన్స్‌, స్టాక్‌ మార్కెట్‌ విభాగాల్లో మిలీనియల్స్‌, జెన్‌జెడ్‌ (జనరేషన్‌ జెడ్‌) వయసు వారే లక్ష్యంగా మీమ్స్‌ తయారు చేయాలంటూ లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌ పెట్టింది. ఇంకెందుకు ఆలస్యం మీమ్స్‌ చేసే టాలెంట్‌ ఉంటే చీఫ్‌ మీమ్‌ ఆఫీసర్‌ జాబ్‌ కొట్టేయండి  

మిలీనియల్స్‌ అంటే..జెన్‌ జెడ్‌ అంటే?
వయసును బట్టి వ్యక్తుల్ని ఐదు తరాలుగా విభజించచ్చు. వీరిలో తొలితరం సైలెంట్‌ జనరేషన్‌. అంటే 1928–1945 మధ్య పుట్టి ఇపుడు 73–90 ఏళ్ల మధ్య వయసున్న వారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం తరువాతి రోజుల్లో..అంటే 1946–1964 మధ్య జననాల రేటు బాగా ఎక్కువగా ఉండడంతో అప్పుడు పుట్టి ప్రస్తుతం 54–72 ఏళ్ల వయసున్నవారిని ‘బేబీ బూమర్‌’ జనరేషన్‌గా పిలుస్తున్నారు. ఆ తరవాత 1965–80 మధ్య పుట్టినవారు జనరేషన్‌ ఎక్స్‌. 1981 నుంచి 1996 మధ్య పుట్టి ప్రస్తుతం 22–37 సంవత్సరాల మధ్యనున్న వారంతా జనరేషన్‌ వై. అంటే మిలీనియల్స్‌. ఆర్జనపరులైన వీరి సంఖ్య దేశంలో 50 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఆ తరవాత పుట్టిన ‘జనరేషన్‌ జెడ్‌’ ఇపుడిపుడే ఉద్యోగాల్లోకి..సంపాదనలోకి వస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top