నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Oct 21 2024 4:10 PM | Updated on Oct 21 2024 4:10 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 72 పాయింట్లు తగ్గి 24,781 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 73 పాయింట్లు దిగజారి 81,151 వద్ద ముగిసింది.

మదుపర్లు లాభాలు స్వీకరించడం, అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్‌ ఈరోజు దేశీయ స్టాక్‌మార్కెట్‌ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తన ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్‌లు నష్టాల్లో ముగుస్తున్నాయి. చైనా మార్కెట​్‌లో ప్రభుత్వ నిర్ణయాలు కొంత అంతర్జాతీయ మార్కెట్లకు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. రానున్న యూఎస్‌ ఎన్నికలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌!

సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఏషియన్‌ పెయింట్స్‌, ఎం అండ్‌ ఎం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మారుతీ సుజుకీ, టెక్‌ మహీంద్రా, నెస్లే, ఎల్‌ అండ్‌ టీ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా మోటార్స్‌, సన్‌ఫార్మా కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement