ఆర్థిక సర్వే అండతో భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్..! | Stock Market: Nifty Above 17,300, Sensex up 800 Points | Sakshi
Sakshi News home page

ఆర్థిక సర్వే అండతో భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్..!

Jan 31 2022 4:01 PM | Updated on Jan 31 2022 4:02 PM

Stock Market: Nifty Above 17,300, Sensex up 800 Points - Sakshi

ముంబై: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు ఆర్థిక సర్వే అండతో భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ధోరణి కొనసాగించాయి. మధ్యాహ్నం సమయంలో 1000 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ దూసుకెళ్లింది. అంతర్జాతీయ సానుకూల సాంకేతలకు తోడు కేంద్ర బడ్జెట్​కు ముందు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో 2021-22 ఏడాదికి జీడీపీ వృద్ధి 9.2శాతంగా ఉంటుందనే అంచనాలు, ఆర్థిక కార్యకలాపాలు కరోనా పూర్వస్థితికి చేరుకున్నాయని తెలపడం వంటి అంశాలు మదుపర్లను కొనుగోళ్లవైపు మళ్లించాయి. దీంతో సెన్సెక్స్​, నిఫ్టీ భారీ లాభాలు పొందాయి.

చివరకు, సెన్సెక్స్ 813.94 పాయింట్లు(1.42%) లాభపడి 58,014.17 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 237.80 పాయింట్లు(1.39%) పెరిగి 17,339.80 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, విప్రో, బిపీసీఎల్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు  అధిక లాభాలను పొందగా.. ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యుపీఎల్, కోల్ ఇండియా & హెచ్యుఎల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఆటో, ఫార్మా, ఐటి, ఆయిల్ & గ్యాస్, పీఎస్‌యు బ్యాంక్ & రియాల్టీ 1-3 శాతం పెరిగాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1-1.7 శాతం మాత్రమే పెరిగాయి. 

(చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా కారు..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement