
సోమవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,950.34 పాయింట్లు లేదా 3.71 శాతం లాభంతో 82,404.81 వద్ద, నిఫ్టీ 912.80 పాయింట్లు లేదా 3.80 శాతం లాభంతో 24,920.80 వద్ద నిలిచాయి. చాల రోజుల తరువాత భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లో క్లోజ్ అవ్వడం బహుశా ఇదే మొదటిసారి.
ఎన్డీఆర్ ఆటో కాంపోనెంట్స్, ఇన్స్పిరిసిస్ సొల్యూషన్స్, ఐఎఫ్జీఎల్ రిఫ్రాక్టరీస్, బిర్లా కార్పొరేషన్, మ్యాన్ ఇండస్ట్రీస్ (ఇండియా) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కేపీఆర్ మిల్, జిందాల్ వరల్డ్‌వైడ్, ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్, పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).