
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో మరోసారి ప్రైమరీ మార్కెట్లు కళకళలాడనున్నాయి. 4 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానుండగా.. మరోవైపు ఇప్పటికే ఐపీవో పూర్తి చేసుకున్న ఏంథమ్ బయోసైన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కానుంది. గత వారం మెయిన్‌బోర్డ్‌లో ఇష్యూ పూర్తి చేసుకున్న ఏంథమ్ బయోసైన్స్ కౌంటర్‌లో నేడు(21న) ట్రేడింగ్‌కు తెరలేవనుంది. ఇష్యూ ధర రూ. 570కాగా.. 64 రెట్లు అధికంగా స్పందన లభించడం గమనార్హం! కాగా.. వర్క్‌స్పేస్ సొల్యూషన్స్ సమకూర్చే ఇండిక్యూబ్ స్పేసెస్‌తోపాటు.. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, మొబైళ్లు తదితర ప్రొడక్టుల పునరుద్ధరణ కంపెనీ జీఎన్‌జీ ఎల్రక్టానిక్స్ ఐపీవోలు 23న ప్రారంభంకానున్నాయి.
ఇదీ చదవండి: రిటైర్మెంట్ కోసం స్మాల్‌క్యాప్ బెటరా?
25న ముగియనున్న ఇష్యూల ద్వారా ఇండిక్యూబ్ రూ. 700 కోట్లు, జీఎన్‌జీ రూ. 460 కోట్లకుపైగా సమకూర్చుకునే యోచనలో ఉన్నాయి. రెండు సంస్థలు ఒకే విధంగా రూ. 225–237 ధరల శ్రేణిని ప్రకటించాయి. ఈ బాటలో ఆతిథ్య రంగ సంస్థ బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ ఐపీవో 24న ప్రారంభంకానుంది. 28న ముగియనున్న పబ్లిక్ ఇష్యూ ద్వారా హోటళ్ల చైన్ సంస్థ రూ. 750 కోట్ల వరకూ సమీకరించే యోచనలో ఉంది. బెంగళూరు, చైన్నై, కొచ్చి తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 9 హోటళ్ల ద్వారా 1,604 గదులను నిర్వహిస్తోంది. బంగారు ఆభరణ తయారీ సంస్థ శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ ఐపీవో 25న ప్రారంభంకానుంది. దీనిలో భాగంగా కంపెనీ 1.8 కోట్ల షేర్లు కొత్తగా జారీ చేయనుంది. ఈ రెండు సంస్థలు ధరల శ్రేణిని ప్రకటించవలసి ఉంది.