సిమ్‌కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్‌’ టెక్నాలజీ!

Snapdragon 8 Gen 2 Phones With Isims - Sakshi

స్మార్ట్‌ఫోన్‌లలో ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. సాధారణ సిమ్‌కార్డులకు కాలం చెల్లి వాటి స్థానంలో డిజిటల్ సిమ్‌లు వస్తున్నాయి.  యాపిల్‌ ఐఫోన్‌ 14, 14ప్రో మోడల్‌లలో ఇప్పటికే ఈ-సిమ్‌ టెక్నాలజీ ఉంది. అంటే ఈ ఫోన్‌లలో ప్రత్యేకంగా సిమ్‌ ట్రేలు ఉండవు. ఇదే క్రమంలో మరో కొత్త టెక్నాలజీ రాబోతోంది.

క్వాల్‌కామ్‌ (Qualcomm), థేల్స్‌ (Thales) సంయుక్తంగా మొదటిసారి ఇంటిగ్రేటెడ్ సిమ్‌(ఐ-సిమ్‌) సర్టిఫికేషన్‌ను ప్రకటించాయి. దీంతో  ఫోన్‌లలో సాధారణ సిమ్‌ కార్డులతో పని ఉండదు. Snapdragon 8 Gen 2తో ప్రారంభమయ్యే అన్ని ఫోన్‌ల ప్రధాన ప్రాసెసర్‌లో ఈ ఐ-సిమ్‌ను పొందుపరుస్తారు. దీంతో ఇక ప్రత్యేకమైన చిప్ అవసరం ఉండదు.

ఈ ఐ-సిమ్‌ టెక్నాలజీ.. ప్రస్తుతం ఉన్న ఈ-సిమ్‌ల మాదిరిగానే డిజిటల్ సైనప్‌లు, సేఫ్టీ ఫీచర్స్‌ను అందిస్తుంది. కానీ దీంతో మరిన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఐ-సిమ్‌ కూడా ఈ-సిమ్‌  లాగా రిమోట్ ప్రొవిజనింగ్ స్టాండర్డ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. అంటే మొబైల్ ఆపరేటర్లు ఈ-సిమ్‌ టెక్నాలజీ సపోర్ట్‌ కోసం ఫోన్‌లను ప్రత్యేకంగా అప్‌గ్రేడ్ చేయనవసరం లేదు. ఫోన్‌లలో సిమ్‌ స్లాట్‌ ఉండదు కాబట్టి ఆ స్థలాన్ని పెద్ద బ్యాటరీలు, ఇతర ముఖ్యమైన భాగాలను చేర్చడానికి ఉపయోగించుకోవచ్చు.

(ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!)

జీఎస్‌ఎం అసోసియేషన్‌ ఆమోదించిన ఈ ఐ-సిమ్‌ టెక్నాలజీ అభివృద్ధిపై క్వాల్‌కాం టెక్నాలజీస్‌, థేల్స్‌ సంస్థలు చాలా ఏళ్లుగా కృషి చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్న ఈ-సిమ్‌తో పాటు థేల్స్ 5జీ ఐ-సిమ్‌ టెక్నాలజీ.. తమ కస్టమర్‌లకు మెరుగైన ఎయిర్-ది-ఎయిర్ కనెక్టివిటీ, ఉత్సాహకరమైన ఉత్పత్తులను అందించేందుకు  మొబైల్‌ తయారీదారులు,  ఆపరేటర్‌లకు మరింత అవకాశాన్ని ఇస్తుందని  థేల్స్‌ మొబైల్‌ ఉత్పత్తుల విభాగం వైస్‌ ప్రెసిడింట్‌ గుయిలామ్‌ లాఫయిక్స్‌ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top