బ్రాటా యమడేంజర్​.. ముందు బ్యాంక్​ అకౌంట్​, ఆపై పర్సనల్​ డాటా.. గుర్తించి జాగ్రత్త పడండి ఇలా!

Smartphone Malware Brata Steal Bank Details Next Pesonal Data - Sakshi

Android Users ALERT:  స్మార్ట్​ఫోన్​లోని బ్యాంకు లాగిన్ వివరాలను లూటీ చేయడంతో పాటు ఫోన్​ సర్వడాటాను కబళించేందుకు మహా డేంజర్ ఆండ్రాయిడ్ మాల్​వేర్​ ‘బ్రాటా’ సిద్ధమైపోయింది.  అప్పుడెప్పుడో 2019లో ఈ ‘బ్యాంకింగ్’ మాల్​వేర్ కలకలం సృష్టింంచిన విషయం తెలిసిందే. బ్రెజిల్​ ఆర్థిక పురోగతిపై పంజా విసిరిన ఈ మాల్​వేర్​ ఇప్పుడు మరోసారి ఆండ్రాయిడ్​ ఫోన్లపై దాడికి కోరలు చాచింది.  

గతంలో బ్రెజిల్ కేంద్రంగా బ్రాటాతో లక్షల యూజర్ల స్మార్ట్​ఫోన్​ డాటాలను దుండగులు కొల్లగొట్టారు. కాస్పర్ స్కీ గుర్తించి.. అప్రమత్తం చేయడంతో మిగతా యూజర్లు జాగ్రత్తపడ్డారు. ఆ టైంలో మాయమై.. మళ్లీ ఈమధ్యే ప్రత్యక్షమైంది. పోయిన నెల(డిసెంబర్​)లో పలువురి బ్యాంకు ఖాతాలు ఖాళీ కావడం, ఆపై ఫోన్లలోని డేటా గాయబ్​ అయిపోవడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ క్లీఫీ అధ్యయనంలో ఈ విషయం తేలింది. 

బ్రిటన్, పోల్యాండ్​, ఇటలీ, స్పెయిన్, చైనాతో పాటు పలు లాటిన్ అమెరికా దేశాల్లోని నెట్ బ్యాంకింగ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు బ్రాటాతో దాడులు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో క్లిఫీ స్టడీ మిగతా దేశాలను అప్రమత్తం చేస్తోంది.

 

ఎలాగంటే..
పుష్ నోటిఫికేషన్లు, గూగుల్ ప్లే, ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్ లు, కాల్స్ ద్వారా ‘బ్రాటా’ మాల్వేర్ ను యూజర్ల ఫోన్లలోకి జొప్పిస్తున్నారు సైబర్​ దుండగులు. అయితే డౌన్ లోడర్ ద్వారా ఫోన్లలోకి ఎక్కిస్తున్న ఈ వైరస్ ను యాంటీ వైరస్ లు కూడా అడ్డుకోలేకపోతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. అచ్చం వైరస్​ వేరియెంట్లలాగానే ఈ మాల్​వేర్​ వేరియెంట్లు సైతం స్టార్ట్​ఫోన్​ను కొంచెం కొంచెం కబళించేస్తుండడం విశేషం.

మూడు రకాలుగా..

  • బ్రాటా.ఏ.. కొన్ని నెలలుగా ఎక్కువగా వ్యాప్తిలో ఉందని, దాంట్లోని జీపీఎస్ ట్రాకింగ్ ఫీచర్ తో ఫోన్​ను ఏకంగా ఫ్యాక్టరీ రీసెట్ కొట్టే అవకాశం ఉంది. 
  • బ్రాటా.బీ.. లోనూ బ్రాటా ఏ టైప్​ ఫీచర్లే ఉన్నాయి. కాకపోతే.. మొదటి రకంతో పోలిస్తే మరింత డేంజర్​. రకరకాల కోడ్​లు, పేజీలతో బ్యాంకుల లాగిన్ వివరాలను బ్రాటా.బీ తస్కరిస్తుంది. 
  • బ్రాటా.సీ విషయానికొస్తే.. స్మార్ట్ ఫోన్లలో మాల్​వేర్​ను జొప్పించడానికి ఉపయోగిస్తున్నారు. డౌన్ లోడ్ చేసుకున్న యాప్(మాల్​వేర్​ యాప్​) ద్వారా.. డాటా అంతా చోరీ చేస్తున్నారు. కాబట్టి దీని విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. 

గుర్తించడం ఎలా.. 

ఉన్నట్లుండి ఫోన్​ స్లో కావడం, క్రాష్​ కావడం, ఎర్రర్​ మెసేజ్​ అంటూ రిపీట్​గా చూపించడం. 
రీబూట్​(రీస్టార్ట్​) లేదంటే షట్​ డౌన్​ కాకపోవడం
ఏదైనా యాప్​, సాఫ్ట్​వేర్​ ఎంతకు డిలీట్​ కాకపోవడం, 
పాప్​ అప్స్​, సంబంధంలేని యాడ్స్​, పేజీ కంటెంట్​ను డిస్ట్రర్బ్​ చేసే యాడ్స్​
అధికారిక వెబ్​సైట్లలోనూ అవసరమైన యాడ్స్ కనిపిస్తుండడం.​
పోర్న్​ వీడియోలకు దూరంగా ఉండడం, అనధికారిక గేమ్స్​ జోలికి పోకపోవడం!. 
ప్లేస్టోర్​లోనూ అధికారిక యాప్​లను.. అదీ రేటింగ్​, రివ్యూలను చూశాకే డౌన్​లోడ్​ చేసుకోవడం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top