
హైదరాబాద్: అడ్వరై్టజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) డైరెక్టర్ల బోర్డుకు శ్లోక అడ్వరై్టజింగ్‌కి చెందిన శ్రీనివాస్ మరోసారి ఎన్నికయ్యారు. భారతీయ అడ్వరై్టజింగ్ రంగంలో ఆయనకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఏఏఏఐ బోర్డుకు తిరిగి ఎన్నిక కావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ శ్రీనివాసన్ కె. స్వామితో పాటు దిగ్గజాలతో కలిసి పని చేయడంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
నైతికతకు ప్రాధాన్యతమిస్తూ పరిశ్రమ పురోగతికి దోహదపడే సానుకూల పరిస్థితుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. దేశీయంగా అడ్వరై్టజింగ్ ఏజెన్సీల సమాఖ్య అయిన ఏఏఏఐ ప్రధానంగా సభ్యుల ప్రయోజనాలను పరిరక్షించడం, అడ్వరై్టజింగ్ ప్రమాణాలను మెరుగుపర్చడం, ప్రొఫెషనలిజంను పెంపొందించడం మొదలైన అంశాలపై దృష్టి పెడుతుంది.