మరణించిన వ్యక్తి ఆధార్ డీయాక్టివేట్ ఇలా.. | Simplest Way to Deactivate Your Deceased Family Member Aadhaar | Sakshi
Sakshi News home page

మరణించిన వ్యక్తి ఆధార్ డీయాక్టివేట్ ఇలా..

Apr 12 2026 7:48 PM | Updated on Apr 12 2026 8:31 PM

Simplest Way to Deactivate Your Deceased Family Member Aadhaar

సైబర్ మోసాలు పెరుగుతున్న సమయంలో.. నకిలీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఆర్ధిక పరమైన నేరాలకు పాల్పడుతున్నారు. బ్రతికున్న వారి డాక్యుమెంట్స్ అనధికార కార్యకలాపాలకు ఉపయోగిస్తే.. కొంతకాలం తరువాత అయినా తెలుసుకోవచ్చు. ఒకవేళా చనిపోయినవారి డాక్యుమెంట్స్ ద్వారా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే?..

దీనిని దృష్టిలో ఉంచుకుని.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఓ ఆధార్ డీ యాక్టివేట్ విధానం పరిచయం చేసింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డీయాక్టివేట్‌ చేయడం ఇలా.. 
➤అధికారిక UIDAIలో MyAadhaar పోర్టల్‌కు వెళ్లండి
➤మీ స్వంత ఆధార్ నెంబర్ లేదా కుటుంబ సభ్యులలో ఎవరిదో ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
➤లాగిన్ అయిన తరువాత Report Death of a Family Member అనే ఆప్షన్ ఎంచుకుని.. మరణించిన వ్యక్తి ఆధార్ వివరాలు నమోదు చేయాలి.
➤తరువాత డెత్ రిజిస్ట్రేషన్‌ నెంబర్ ఎంటర్ చేయాలి.
➤మున్సిపాలిటీ లేదా సంబంధిత అధికారులు జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం అప్‌లోడ్ చేయాలి.
➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. వివరాలను వెరిఫై చేసిన తర్వాత UIDAI మరణించిన వ్యక్తి ఆధార్‌ను శాశ్వతంగా డీయాక్టివేట్ చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement