2026 ప్రారంభంలో భారీగా పెరిగిన వెండి, క్రమంగా తగ్గుతూ.. పెరుగుతూ ముందుకు సాగింది. మూడు నెలల కాలంలో ఏకంగా 44 శాతం తగ్గినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇలాంటి సమయంలో వెండి కొనాలా?, ఇంకొంత కాలం వేచి చూడాలా? అని చాలామందికి అనుమానం కలిగింది. ఈ కథనంలో మీ అనుమానాలకు సమాధానం చూసేద్దాం.
జనవరి 2026లో రూ.4.20 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. నేటికి (మార్చి 26) రూ.2.60 లక్షల వద్దకు చేరింది. అంటే మూడు నెలలు ఇంకా గడవక ముందే సిల్వర్ రేటు రూ.1.60 లక్షలు తగ్గింది. సాధారణంగా.. ధరలు 20 శాతం కంటే తగ్గితే లేదా నష్టపోతే దాన్ని బేర్ మార్కెట్ అంటారు. ఇప్పుడు వెండి పరిస్థితి ఇక్కడే ఉందని నిపుణులు చెబుతున్నారు.
వెండి ధరలు తగ్గడానికి కారణం?
సిల్వర్ ధరలు ఇంతలా తగ్గిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా డాలర్ విలువ బలపడటం అనే చెప్పాలి. ఇది కాకుండా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల సరఫరా అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉండవచ్చని అంచనాలు కూడా వెండి ధరలు తగ్గడానికి కారణమవుతున్నాయి.
నిపుణుల అభిప్రాయం
క్రమంగా తగ్గిన వెండి ధరలు మెల్లగా పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న ధరలతో పోలిస్తే.. ఇప్పుడున్న ధరలు చాలా తక్కువ. కాబట్టి వెండి కొనుగోలు చేయడానికి ఇది మంచి తరుణం అని కొందరు చెబుతున్నారు. ధరలు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇంకొంతకాలం వేచి ఉండటం మంచిదని మరికొందరు చెబుతున్నారు.
పెట్టుబడిదారులకు సూచనలు
బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం. అది ఆభరణాలుగా కొనుగోలు చేస్తారా?, బిస్కెట్స్, కడ్డీల రూపంలో కొనుగోలు చేస్తారా అనేది పూర్తిగా మీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడి అనేది మీ సొంత నిర్ణయం. అవసరమైన నమ్మకమైన నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
ఇదీ చదవండి: రూ.3 లక్షలకి ఆర్డర్ పెడితే.. వాషింగ్ పౌడర్ వచ్చింది!


