
భారతదేశంలో స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న వ్యవస్థాపిత అవరోధాలను తొలగించేందుకు ఒక యువ పారిశ్రామికవేత్త ముందుకొచ్చాడు. గ్రామీణ కేరళకు చెందిన షఫీ షౌఖత్.. బెంగళూరులో రూ.600 కోట్లు విలువ చేసే స్టార్టప్ పార్క్‌ను స్థాపించి దేశవ్యాప్తంగా వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు కలిసి పనిచేయగల నూతన వ్యవస్థను నిర్మిస్తున్నారు.
గ్రామం నుంచి గ్లోబల్ దిశగా..
స్టార్టప్‌లకు అవసరమైన మార్గనిర్దేశం, పెట్టుబడులు వంటి వనరులేవీ లేని కేరళలోని ఒక చిన్న గ్రామంలో షఫీ షౌఖత్ పెరిగారు. ఈ అనుభవం కారణంగా, తాను ఏర్పాటుచేసే స్టార్టప్ పార్క్‌లో ప్రతి సమస్యకు ప్రత్యేక పరిష్కార మార్గాలు ఉండేలా, “ప్రాబ్లం-ఫస్ట్ ఫ్రేమ్‌వర్క్”ను రూపొందించారు.
“సాధారణ ప్రోగ్రామ్స్ తో యూనిక్ సమస్యలు పరిష్కరించలేము” అని చెప్పే షౌఖత్ “ఎగ్జిక్యూషన్ ఆధారంగా, మెజరబుల్ ఇంపాక్ట్ వచ్చే విధంగా వ్యవస్థలు రూపొందించాలి” అంటున్నారు.
స్టార్టప్ పార్క్ లక్ష్యాలు
దేశవ్యాప్తంగా ఉన్న యువ వ్యవస్థాపకులను అనుసంధానించడం
వ్యక్తిగత అవసరాలకు తగిన మెంటార్షిప్, పెట్టుబడి అవకాశం కల్పించడం
ప్రభుత్వాల కోసం పాలసీ ప్రయోగశాలగా పనిచేయడం
పెట్టుబడిదారులకు డేటా ఆధారంగా దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించడంలో సహకారం
నెక్స్ట్ లీడర్స్ ప్రోగ్రామ్
షౌఖత్ ప్రారంభించిన నెక్స్ట్ లీడర్స్ ప్రోగ్రామ్కు ఇప్పటికే మంచి స్పందన పొందుతోంది. ఇందులో హై-పొటెన్షియల్ వ్యక్తుల ఎంపిక, వారి ప్రతిభకు తగ్గ స్టార్టప్ అనుభవం, పరిశ్రమ ప్రముఖుల నుంచి స్రాటెజిక్ మార్గదర్శనం, పెట్టుబడిదారులు, పాలిసీ మేకర్లు ఉన్న నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేవడం వంటివి ఉన్నాయి.
భారత స్టార్టప్ భవిష్యత్తుకు కొత్త నమూనా
సాధారణ ఇంక్యుబేటర్ల కన్నా షౌఖత్ రూపొందిస్తున్న ఈ మోడల్ ఒక కొత్త దిశను సూచిస్తుంది. ఇది సిద్ధాంతాల కంటే కార్యాచరణకు, వెయిన్ గణాంకాల కంటే నిజమైన ప్రభావానికి, పోటీ కంటే భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తోంది.
ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు ఈ మోడల్‌ను అధ్యయనం చేస్తుండటం గమనార్హం. భారతదేశం 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల స్టార్టప్ ఆర్థికవ్యవస్థగా అభివృద్ధి చెందబోతున్న సమయంలో, షఫీ షౌఖత్ తీసుకుంటున్న అడుగులు దేశం భవిష్యత్తు పారిశ్రామికతకు ఒక శక్తివంతమైన బేస్‌గా నిలవవచ్చునన్న అంచనాలు ఉన్నాయి.