భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్‌లు!

దేశీయ స్టాక్ మార్కెట్‌లో సోమవారం బుల్ జోరు కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లు పాజిటీవ్ వైబ్స్‌తో కొనసాగుతుండగా..వాటి ప్రభావం దేశీయ మార్కెట్‌లపై ప్రభావం చూపింది. దీంతో సోమవారం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 864 పాయింట్ల భారీ లాభంతో 55749 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ సైతం 381 లాభంతో 35995 పాయింట్ల వద్ద ట్రేడ్‌ను కంటిన్యూ చేస్తుంది.
టైటాన్ కంపెనీ, అదానీ పోర్ట్స్,యూపీఎల్, ఆల్ట్రాటెక్ సిమెంట్,హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, గ్రిసిం, టెక్ మహీంద్రా,కిప్లా, శ్రీ సిమెంట్, విప్రో, టాటా మోటార్స్, టాటా కాన్స్,టీసీఎస్,లారెసన్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతుండగా.. జేఎస్‌డ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్, కొటక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.