ఆర్బీఐ బూస్ట్‌: బుల్‌ రన్‌, లాభాల్లోకి సూచీలు | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ బూస్ట్‌: బుల్‌ రన్‌, లాభాల్లోకి సూచీలు

Published Thu, Apr 6 2023 10:24 AM

Sensex Nifty gains after RBI rate decision - Sakshi

సాక్షి,ముంబై:  కీలక వడ్డీరేట్లపై ఆర్బ్‌ఐ  ప్రకటన  వెలువడిన వెంటనే కీలక లాభాల్లోకి మళ్లాయి.  కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఫలితంగా  సెన్సెక్స్‌ 146 పాయింట్లు ఎగిసి 59,835 వద్ద, నిఫ్టీ  36 పాయింట్లు ఎగిసి 17592 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు  కనిపిస్తున్నాయి. 

 కాగా రెపో రేట్లను  యథాతథంగా ఉంచిన ఆర్బీఐ అందర్నీ  ఆశ్చర్యపర్చింది. తాజా నిర్ణయంతో రెపోటు 6.50 శాతంగా కొనసాగనుంది. ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తి కాంత దాస్‌  ప్రకటించారు.  అయితే ప్రస్తుత  గ్లోబల్‌ అనిశ్చిత పరిస్థితుల్లో మరోసారి  25పాయింట్ల మేర రెపో రేటు పెంపుఉంటుందనే అంచనాలు   ఎక్కువగా వినిపించాయి.  (గుడ్‌ న్యూస్‌ యథాతథంగా కీలక వడ్డీరేట్లు)

Advertisement
Advertisement