బుల్ జోరు... భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్! | Sensex gains 1040 pts, Nifty above 16900 ahead of US Fed decision | Sakshi
Sakshi News home page

బుల్ జోరు... భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్!

Mar 16 2022 4:11 PM | Updated on Mar 16 2022 4:11 PM

Sensex gains 1040 pts, Nifty above 16900 ahead of US Fed decision - Sakshi

ముంబై: నిన్న భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. నేడు అంతే స్థాయిలో సూచీలు తిరిగి పుంజుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. మొదటి నుంచి లాభాల్లో ప్రారంభం అయిన సూచీలకు ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు దన్నుగా నిలిచాయి. దీనికి తోడు నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో సూచీలు భారీ లాభాల దిశగా అడుగులు వేశాయి. 

ముగింపులో, సెన్సెక్స్ 1,039.80 పాయింట్లు(1.86%) పెరిగి 56,816.65 వద్ద ఉంటే, నిఫ్టీ 312.30 పాయింట్లు(1.87%) లాభపడి 16,975.30 వద్ద ఉంది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.21 వద్ద ఉంది. నిఫ్టీలో అల్ట్రాటెక్ సీమెంట్, యాక్సిస్ బ్యాంక్, శ్రీ సిమెంట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు రాణిస్తే.. సీప్లా, సన్ ఫార్మా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ & రియాల్టీ సూచీలు 2-3 శాతం పెరగడంతో అన్ని సెక్టోరల్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆటో, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, పవర్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా జోడించాయి.

(చదవండి: ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర..అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్?!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement