రెసిషన్‌ భయాలు: స్టాక్‌ మార్కెట్లు ఢమాల్‌

Sensex crashNifty below 15400 Recession fears - Sakshi

52 వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్‌

15400 స్థాయిని కోల్పోయిన   నిఫ్టీ

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేటు భారీ పెంపు తరువాత గురువారం భారీ లాభాలతో మురిపించాయి. కానీ ఆ మురిపెం ఎంతో సేపు నిలవలేదు. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాల కారణంగా నెలకొన్న భారీ సెల్లింగ్‌ ధోరణితో కీలక సూచీలు రెండూ  భారీ పతనాన్ని నమోదు చేశాయి.  

సెన్సెక్స్‌ 1046 పాయింట్లు నష్టంతో 51495 వద్ద, నిఫ్టీ 332 పాయింట్లు కుప్పకూలి 15360 వద్ద స్థిరపడ్డాయి. ఫలితంగా  సెన్సెక్స్‌ 52 వేలు, నిఫ్టీ 15400 దిగువకు జారిపోవడం గమనార్హం. బ్యాంకింగ్‌, ఐటీ, మెటల్‌ ఇలా అన్ని రంగాల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ రియాల్టీ, ఆటో, బ్యాంక్, ఐటీ సూచీలు 2 శాతంపైగా పతనమయ్యాయి.

అలాగే  విమాన ఇంధన ధరలు భారీగా పెరగడంతో విమానయాన రంగ షేర్లు నష్టపోయాయి. ఆఖరి గంటలో అమ్మకాల సెగ మరింత పెరిగింది.  ఫలితంగా 2021 మే నాటికి స్ఠాయిల కిందికి  రికార్డు పతనమైనాయి. టెక్‌ మహీంద్ర,టాటా స్టీల్‌ , విప్రో,ఇన్ఫోసిస్‌, హిందాల్కో, గ్రాసిం 52 వారాల కనిష్టానికి చేరాయి.  టాటా మోటార్స్‌, రిలయన్స్‌ వేదాంత, టాటా స్టీల్‌, స్పైస్‌ జెట్‌,  ఇండిగో, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ ఇతర టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. 

అటు డాలరు మారకంలో  దేశీ రూపాయి కూడా నష్టాల్లోనే ముగిసింది. బుధవారంనాటి 78.22 ముగింపుతో పోలిస్తే 15 పైసలు ఎగిసి 78.07 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top