శాంసంగ్‌ నుంచి కొత్త 5జీ ఫోన్లు.. ఫీచర్లు అదిరిపోయాయ్‌, లాంచ్‌ డేట్‌ అప్పుడే!

Samsung Galaxy A Series Smartphones Plans To Launch On January 18 India - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ శాంసంగ్ నూతన సంవత్సరంలో కొత్త మొబైల్‌ని లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే భారతీయ మార్కెట్లో ఓ బడ్జెట్ ఫోన్‍ను లాంచ్ చేసిన ఈ కంపెనీ.. తాజాగా శాంసంగ్ ఏ సిరీస్‍ 5జీ (Samsung Galaxy A Series) ఫోన్లను జనవరి 18న లాంచ్ చేయనున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఏ మోడల్‌ అన్నదానిపై ఇంకా స్పష్టం చేయలేదు.

అయితే ఇటీవల యూఎస్‌, యూరప్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ (Samsung Galaxy A14), విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ఈ మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అవుతుందనే తెలుస్తోంది. శాంసంగ్ మాత్రం దీనిపై పూర్తి సమాచారం తెలపకుండానే ఏ సిరీస్‍లో 5జీ ఫోన్లను విడుదల చేస్తామని, ఆ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేకతలను టీజ్ చేసింది.

ప్రత్యేకతలు
ఈ స్మార్ట్‌ఫోన్‌.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల పూర్తి-HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ముందు భాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో వస్తోంది.  బ్యాటరీ 2 రోజుల వరకు బ్యాకప్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటిని చూస్తే ఇటీవల ప్రారంభించిన Galaxy A14 5G రూపకల్పనను పోలి ఉంటుంది.

మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్‍యూఐ 5.0 అందుబాటులోకి వచ్చింది. ఈనెల 18న సామ్‍సంగ్ ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీతో పాటు గెలాక్సీ ఏ23 5జీ మొబైళ్లను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. వీటితో పాటు గెలాక్సీ ఏ34 5జీ, గెలాక్సీ ఏ54 5జీ మోడళ్లకు కూడా  విడుదలై అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top