హైదరాబాద్‌ ఫార్మా కంపెనీ లాభం హైజంప్‌ | sai parenterals q4 results net profit surges | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఫార్మా కంపెనీ లాభం హైజంప్‌

May 25 2026 4:52 PM | Updated on May 25 2026 4:53 PM

sai parenterals q4 results net profit surges

హైదరాబాద్‌: ఫార్మాస్యూటికల్స్‌ రంగ కంపెనీ సాయి పేరెంటరల్స్‌ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు ప్రకటించింది. క్యూ4 (జనవరి–మార్చి)లో నికర లాభం భారీగా జంప్‌చేసి రూ. 13 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 1.6 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 74 కోట్ల నుంచి రూ. 201 కోట్లకు ఎగసింది.

నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 6 కోట్ల నుంచి రూ. 29 కోట్లకు మెరుగుపడింది. పూర్తి ఏడాదికి నికర లాభం 45 శాతం వృద్ధితో రూ. 14 కోట్లను అధిగమించింది. 2024–25లో రూ. 10 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 159 కోట్ల నుంచి రూ. 381 కోట్లకు జంప్‌ చేసింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాలివి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement