పుష్కరకాలం తర్వాత రూపాయి భారీ ర్యాలీ | Rupee Soars 152 Paise to 12 Year High as RBI Tightens Dollar Rupee Trading | Sakshi
Sakshi News home page

పుష్కరకాలం తర్వాత రూపాయి భారీ ర్యాలీ

Apr 3 2026 8:58 AM | Updated on Apr 3 2026 10:39 AM

Rupee Soars 152 Paise to 12 Year High as RBI Tightens Dollar Rupee Trading

ఆర్‌బీఐ జోక్యంతో అతిపెద్ద లాభం  

డాలర్‌ మారకంలో 152 పైసలు బలపడి 93.18 వద్దకు.. 

బ్యాంకుల డాలర్‌–రూపాయి ఫార్వర్డ్‌ ట్రేడింగ్‌ను నియంత్రించేందుకు ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకోవడంతో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 152 పైసలు బలపడి 93.18 వద్ద ముగిసింది. ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో 94.62 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 188 పైసలు బలపడి 92.82 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. గడిచిన 12 ఏళ్లల్లో ఒకరోజులో ఈ స్థాయిలో బలపడటం ఇదే తొలిసారి.

‘ఫారెక్స్‌  మార్కెట్లో మార్పులను సమీక్షించిన తర్వాత ఆర్‌బీఐ కొన్ని నియంత్రణ చర్యలు ప్రకటించింది. రూపాయికి సంబంధించిన నాన్‌–డెలివరబుల్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టులను రెసిడెంట్, నాన్‌–రెసిడెంట్‌ వినియోగదారులకు అందించకుండా బ్యాంకులను ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. అలాగే, ఈ ఆదేశాల తర్వాత రద్దు చేసిన ఎలాంటి ఫారెక్స్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టులను అయినా మళ్లీ బుక్‌ చేసుకోవడాన్ని కూడా పరిమితం చేసింది. దీనివల్ల డాలర్లకున్న కృత్రిమ డిమాండ్‌ తగ్గడంతో రూపాయికి బలం చేకూరింది’ అని మీరే అసెట్‌ షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ నిపుణుడు అనుజ్‌ చౌదరీ తెలిపారు.

ఇదీ చదవండి: ఆంత్రోపిక్‌ సోర్స్ కోడ్ లీక్‌!

Advertisement
 
Advertisement
Advertisement