52 పైసలు పతనమైన రూపాయి  | Rupee falls 52 paise to close at 95. 48 against US Dollar | Sakshi
Sakshi News home page

52 పైసలు పతనమైన రూపాయి 

Jul 9 2026 12:25 AM | Updated on Jul 9 2026 12:25 AM

Rupee falls 52 paise to close at 95. 48 against US Dollar

డాలర్‌ మారకంలో 95.48 వద్ద ముగింపు 

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ 52 పైసలు క్షీణించి 95.48 వద్ద ముగిసింది. అమెరికా ఇరాన్‌పై తాజా వైమానిక దాడులు జరపడం, దీనికి ప్రతిగా ఇరాన్‌ బహ్రెయిన్, కువైట్‌లపై దాడులు చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. హార్మూజ్‌ జలసంధి ద్వారా చమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడొచ్చన్న ఆందోళనతో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరలు 6 శాతానికి పైగా ఎగిశాయి. 

ప్రపంచవ్యాప్తంగా సురక్షిత పెట్టుబడిగా భావించే అమెరికా డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో డాలర్‌ ఇండెక్స్‌ 101.13 స్థాయికి చేరుకుంది. మరోవైపు దేశీయ ఈక్విటీ సూచీలు రెండుశాతానికి పైగా క్షీణించింది. ఈ పరిణామాలన్నీ రూపాయి కోతకు కారణమయ్యాయి. ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి 95.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించి, ఇంట్రాడేలో 94.98–95.61 శ్రేణిలో కదలాడింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement