అధిక వృద్ధి బాటలో రిలయన్స్‌ కన్జూమర్‌ | reliance consumer products high growth path revenue crosses 22000 crore 2030 | Sakshi
Sakshi News home page

అధిక వృద్ధి బాటలో రిలయన్స్‌ కన్జూమర్‌

May 30 2026 5:34 PM | Updated on May 30 2026 5:44 PM

reliance consumer products high growth path revenue crosses 22000 crore 2030

న్యూఢిల్లీ: సానుకూల స్థూల ఆర్థిక పరిస్థితుల దన్నుతో 2030 నాటికి ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ (ఆర్‌సీపీఎల్‌) ఆదాయం అనేక రెట్లు పెరగనున్నట్లు మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తమ వార్షిక నివేదికలో తెలిపింది. 2025–26లో కంపెనీ ఆదాయం రెండు రెట్లు పెరిగి రూ. 22,000 కోట్లు దాటినట్లు వివరించింది. నిత్యావసరాలు, పానీయాల విక్రయాలు ఇందుకు దోహదపడినట్లు పేర్కొంది.

అంతర్జాతీయంగా అగ్రగామి బ్రాండెడ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ కంపెనీల్లో ఒకటిగా ఎదగాలన్న లక్ష్య సాకారం దిశగా ఆర్‌సీపీఎల్‌ ఇకపైనా ఇతర సంస్థలు, బ్రాండ్స్‌ కొనుగోళ్లను కొనసాగిస్తుందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వివరించింది. 2025 డిసెంబర్‌ 1న రిలయన్స్‌ రిటైల్‌ నుంచి విడగొట్టిన ఆర్‌సీపీఎల్‌ ప్రస్తుతం ఎఫ్‌ఎంసీజీ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఒకటిగా ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement