రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్ & వ్యవస్థాపకురాలు 'నీతా అంబానీ' విద్య, క్రీడలు ప్రతి చిన్నారి జీవితాన్ని మార్చగల శక్తివంతమైన సాధనాలని ముంబై ఇండియన్ జట్టుకు వివరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'అందరికీ విద్య, క్రీడలు' అనే కార్యక్రమంలో నీతా అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పేద, వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్యతో పాటు క్రీడల్లో అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా.. వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ను వీక్షించేందుకు దాదాపు 20 వేల మంది నిరుపేద పిల్లలను ఆహ్వానించారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్ చిన్నారులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించింది. క్రీడలు పిల్లల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, జట్టు భావన పెంచుతాయని నీతా అంబానీ పేర్కొన్నారు.
“𝙔𝙤𝙪 𝙖𝙡𝙨𝙤 𝙨𝙢𝙞𝙡𝙚 𝙖𝙣𝙙 𝙢𝙖𝙠𝙚 𝙩𝙝𝙚 𝙘𝙝𝙞𝙡𝙙𝙧𝙚𝙣 𝙖𝙡𝙨𝙤 𝙨𝙢𝙞𝙡𝙚!”
A special message to the squad from Mrs Nita Ambani ahead of today’s special Reliance Foundation #ESAMatchDay! 💙#MumbaiIndians #OneFamily pic.twitter.com/SOTmsrNnMS— Reliance Foundation (@ril_foundation) May 24, 2026


