రెండు నెలలే బెంగళూరులో.. ముంబైవాసి ఏమన్నారంటే? | Mumbai Resident Misses City Just 2 Months After Moving To Bengaluru | Sakshi
Sakshi News home page

రెండు నెలలే బెంగళూరులో.. ముంబైవాసి ఏమన్నారంటే?

Apr 4 2026 7:45 PM | Updated on Apr 4 2026 8:10 PM

Mumbai Resident Misses City Just 2 Months After Moving To Bengaluru

కొత్త నగరానికి వెళ్తే.. తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరికి ఇది ఒక స్వేచ్ఛని, కొత్త అవకాశాలను ఇవ్వడానికి ఒక అవకాశంలా అనిపించినా.. కష్టంగానే ఉంటుందని ఒక ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

''బెంగళూరు వచ్చి రెండు నెలలైంది, నాకు ముంబై గుర్తొస్తోంది. అక్కడి మనుషులు గుర్తొస్తున్నారు. ఇక్కడ (బెంగళూరు) ప్రతి చిన్న సంభాషణ ఒక బేరమాడటంలా అనిపిస్తుంది. ఆటో డ్రైవర్లు, ప్యాకర్లు, అద్దెదారులు అందరితోనూ కొంత కష్టమే. ప్రతి ఒక్కరూ మన నుంచి ఏదో ఒకటి పిండుకోవాలని చూస్తుంటారు. ముంబైలో క్యాబ్ డ్రైవర్ వేడిగా ఉందని చూసి ఏసీ వేసేస్తాడు. ఇక్కడ మాత్రం.. అదొక వ్యక్తిగత సహాయం అన్నట్టు అడగాలి. ఈ ఒక్క విషయం మీకు అన్ని విషయాలు చెబుతుంది'' అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించాడు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది ముంబై నివాసి అభిప్రాయాలతో ఏకీభవించగా, మరికొందరు ఇలాంటి అనుభవాలు చాలావరకు వ్యక్తిగతమైనవని అభిప్రాయపడ్డారు.

నిజమే! ముంబై చాలా స్వాగతించేదిగా, ఆప్యాయంగా ఉంటుందని ఒక వినియోగదారుడు అనగా, మరొకరు ఇలా అన్నారు.. ముంబైలో ఏ క్యాబ్ డ్రైవర్ అయినా అడగకుండా ఏసీ ఆన్ చేస్తాడా? అని అడిగాడు. నేను బెంగళూరు వాసిని, చాలా నగరాలు తిరిగాను, నేను పూర్తిగా ఈ విషయంలో ముంబై వాసికి సపోర్ట్ చేస్తున్నా.. అని అన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement