భారీ జీతమా?, వర్క్-లైఫ్ బ్యాలెన్సా?, అనే విషయపై చాలారోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి రూ.72 లక్షల వేతనంతో కూడిన జాబ్ ఆఫర్‌ను తిరస్కరించారు. దీనికి సంబంధించిన ట్విట్టర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. ఆ ఉద్యోగ ఆఫర్‌లో కొన్ని కఠినమైన షరతులు ఉన్నాయి. వారానికి ఐదు రోజులు ఆఫీస్‌కు రావాలి, అధికారిక సెలవు విధానం లేదు, అలాగే రీలోకేషన్ సహాయం కూడా ఇవ్వలేదు. ఈ కారణాలతో అభ్యర్థి ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రస్తుత జీతంపై కేవలం 25 శాతం మాత్రమే పెంపు ఉన్నట్లు కూడా వెల్లడించారు. పెరిగిన జీవన వ్యయం, వ్యక్తిగత సమయానికి అవకాశం లేకపోవడం వంటి అంశాలు కూడా అతని జాబ్ రిజెక్ట్ చేయడానికి కారణమైంది.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. కొంతమంది వినియోగదారులు ఇంత పెద్ద జీతాన్ని వదిలేయడం ఆశ్చర్యం అని భావించగా, మరికొందరు మాత్రం డబ్బు కంటే మానసిక, శారీరక ఆరోగ్యం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
My friend just rejected a 72 LPA offer.
Reasons:
• 5 days strict WFO
• No leave policy
• Zero relocation support
What shocked me the most? He had zero sense of loss.
It’s fascinating that people like these exist who are willing to let so much money go because of work life… pic.twitter.com/GtSOLEi4S3— Ragini Pandey (@pandeyragini24) May 31, 2026
ఒక వినియోగదారు తాను ఏడాదికి ఒక కోటి రూపాయలకుపైగా సంపాదించినప్పటికీ, నిరంతరం పని ఒత్తిడిలో ఉండటం వల్ల జీవితం కష్టమైందని చెప్పాడు. మరో వ్యక్తి 2015లో ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి, తక్కువ జీతం ఉన్న కానీ ప్రశాంతమైన ఉద్యోగాన్ని ఎంచుకున్నానని తన అనుభవాన్ని పంచుకున్నాడు.
ఈ చర్చ ద్వారా ఒక ముఖ్యమైన విషయం స్పష్టమవుతోంది. నేటి ఉద్యోగ ప్రపంచంలో కేవలం జీతం మాత్రమే కాదు, పని వాతావరణం, వ్యక్తిగత సమయం, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమవుతున్నాయి. ఎక్కువ డబ్బు ఉన్న ఉద్యోగాలు అన్ని సమయాల్లో సంతోషాన్ని ఇవ్వవు అనే ఆలోచన ఉద్యోగులలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇదీ చదవండి: జాబ్ అంత ఈజీ కాదు.. అమెజాన్ మాజీ ఉద్యోగి ఆవేదన!


