MG Comet EV: మొదలైన 'ఎంజీ కామెట్' టెస్ట్ డ్రైవ్స్ - బుకింగ్స్ & డెలివరీ వివరాలు

MG comet ev bookings and test drives details - Sakshi

ఇటీవల భారతదేశంలో విడుదలైన చిన్న హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ కారు 'ఎంజీ కామెట్' ఎంతో మంది వాహన ప్రేమికుల మనసు దోచింది. ఈ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే కస్టమర్లు 2023 మే 15 నుంచి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు డెలివరీలు, టెస్ట్ డ్రైవ్స్ వంటి వివరాలు ఇక్కడ చూసేద్దాం..

గత నెల చివరిలో విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ కారు ఎంజి కామెట్ ఈవీ టెస్ట్ డ్రైవ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కావున ఆసక్తి కలిగిన కస్టమర్లు కంపెనీ డీలర్‌షిప్‌ల ద్వారా టెస్ట్ డ్రైవ్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 7.98 లక్షలు (ఎక్స్-షోరూమ్). కాగా డెలివరీలు మే నెల చివరి నాటికి ప్రారంభమవుతాయి.

ఎంజి కామెట్ చూడటానికి చిన్న కారు అయినప్పటికీ అద్భుతమైన డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు డిజైన్ విషయానికి వస్తే ఎంజీ కామెట్ ఈవీ వెడల్పు అంతటా ఎల్ఈడీ లైట్ బార్ కలిగి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ లైట్ బార్ కింద ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉండటం గమనించవచ్చు. 

(ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?)

ఫీచర్స్ విషయానికి వస్తే ఈ చిన్న కారు 10.25 ఇంచెస్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇందులోనే ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డ్రైవర్ డిస్ప్లే రెండూ ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, మ్యాన్యువల్ ఏసీ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటితో పాటు 55కి పైగా కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి.

(ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!)

3.67 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఎంజి కామెట్ ఎలక్ట్రిక్ కారు ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 230 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI దృవీకరించింది. ఈ రేంజ్ అనేది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ కారు 3.3 కిలోవాట్ ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ కావడానికి 7 గంటల సమయం పడుతుంది.

ఎంజి కామెట్ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ పరిమాణం పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఏబీఎస్ విత్ ఈబిడి, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రివర్స్ కెమెరా వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో సిట్రోయెన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కారుకి ప్రత్యర్థిగా ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top