మారుతికి కోవిడ్‌ దెబ్బ: లాభాలు ఢమాల్‌

Maruti Suzuki FY21 net profit dips Rs 4,230 crore - Sakshi

2020-21 ఏడాదిలో 25 శాతం క్షీణించిన నికరలాభం

కరోనా సంక్షోభంతో పడిపోయిన విక్రయాలు

రూ.45 మధ్యంతర డివిడెండ్

సాక్షి, ముంబై: కోవిడ్-19 మహమ్మారి బెడద దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకిని పట్టి పీడిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా మహమ్మారి కారణంగా  అమ్మకాలతో  భారీగా దెబ్బతిన్నాయి. దీంతో  క్యు4 లో ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయాయి.  2021 ఆర్ధిక సంవత్సరంలో  25.1 శాతం క్షీణితతో నికర లాభం రూ .4,229.7 కోట్లుగా ఉందని కంపెనీ మంగళవారం వెల్లడించింది. అలాగే ఆదాయం 7.2శాతం క్షీణించి  రూ.66562 కోట్లకి పరిమితమైంది. మరోవైపు కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .45 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. (ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌సేల్‌: భారీ ఆఫర్లు)

జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏకంగా 10శాతం క్షీణత నమోదు చేసింది. 9.7 శాతం తగ్గి1,166.10 కోట్లకు చేరుకోగా, నికర అమ్మకాలు 33.6 శాతం పెరిగి రూ .22,958 కోట్లకు చేరుకున్నాయి. వాహన విడిభాగాల ధరలు పెరగడం, రూపాయి మారకపు విలువ, నిర్వహణేతర ఆదాయం తగ్గిపోవడం వంటి కారణాలతో ఈ క్షీణత నమోదైనట్లు  కంపెనీ చెప్పింది.  కరోనా, సంబంధిత  ఆంక్షల నేపథ్యంలో అమ్మకాలు 6.7 శాతం క్షీణించి 14,57,861 వాహనాలకు చేరుకున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు 21.7 శాతం తగ్గాయి. దేశీయ అమ్మకాలు 6.8 శాతం క్షీణించి 13,61,722 యూనిట్లకు చేరుకోగా, ఎగుమతులు 5.9 శాతం తగ్గి 96,139 యూనిట్లకు చేరుకున్నాయి. నికర అమ్మకాలు ఈ ఏడాదిలో 66,562.10 కోట్ల రూపాయలుగా ఉండగా, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 7.2 శాతం తక్కువ.  (కరోనా రెండో దశ : స్వల్పంగా తగ్గిన పాజిటివ్‌ కేసులు)

చదవండి :  సుజుకి హయాబుసా క్రేజ్: ఆ వేరియంట్‌ ఔట్‌ ఆఫ్‌ స్టాక్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top