బక్రీద్‌పై కన్ఫ్యూజన్.. మే 28న స్టాక్ మార్కెట్లకు సెలవా? | Markets Shut Or Open For Bakrid Know The Details Here | Sakshi
Sakshi News home page

బక్రీద్‌పై కన్ఫ్యూజన్.. మే 28న స్టాక్ మార్కెట్లకు సెలవా?

May 26 2026 4:00 PM | Updated on May 26 2026 4:13 PM

Markets Shut Or Open For Bakrid Know The Details Here

భారతదేశంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్‌లైన.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లు 2026 మే 28, గురువారం రోజున బక్రీద్ పండుగ సందర్భంగా మూతపడనున్నాయి. కాబట్టి.. స్టాక్ మార్కెట్లలో అన్ని ప్రధాన ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.

ఎన్‌ఎస్‌ఈ విడుదల చేసిన అధికారిక సెలవుల క్యాలెండర్ ప్రకారం.. బక్రీద్ రోజు ఈక్విటీ ట్రేడింగ్, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB), ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGR) వంటి విభాగాలలో ట్రేడింగ్ ఉండే అవకాశం లేదు. అందువల్ల పెట్టుబడిదారులు ఆ రోజున షేర్ల కొనుగోలు లేదా అమ్మకాలు చేయలేరు.

అయితే.. ఈసారి బక్రీద్ సెలవు మే 27న ఉంటుందా?, లేదా మే 28న ఉంటుందా? అనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. కొన్ని రాష్ట్రాలు, సంస్థలు మొదట మే 27ను పరిగణించినప్పటికీ.. ఎక్కువ శాతం ఆర్థిక సంస్థలు, స్టాక్ ఎక్స్చేంజ్‌లు మే 28నే అధికారిక సెలవు రోజుగా ప్రకటించాయి. దీంతో పెట్టుబడిదారులు తమ ట్రేడింగ్ ప్రణాళికలను దానికి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది.

అదేవిధంగా.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) కూడా మే 28 ఉదయం సెషన్‌ మూతపడనుంది. అయితే.. సాయంత్రం సెషన్‌లో కమోడిటీ ట్రేడింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే.. బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్ వంటి వస్తువుల ట్రేడింగ్ సాయంత్రం తర్వాత కొనసాగుతుందన్నమాట.

ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement