పికప్‌ వాహనాలకు మహీంద్రా ఫైనాన్స్‌

Mahindra Offer Financial Schemes For The Purchase Of Its Range Of Small Commercial Vehicles - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా తాజాగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం చేసుకుంది.ఇందులో భాగంగా కంపెనీ తయారీ పికప్, చిన్న వాణిజ్య వాహనాలను వినియోగదార్లు రూ.6,666 నెలవాయిదాతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో భాగంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా తాజాగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. ఇకపై కంపెనీ తయారీ పికప్, చిన్న వాణిజ్య వాహనాలను వినియోగదార్లు రూ.6,666 నెలవాయిదాతో కొనుగోలు చేయవచ్చు.

వడ్డీ రేటు 11.5 శాతం నుంచి ప్రారంభం. రూ.10 లక్షల వరకు వాహనానికి (ఆన్‌ రోడ్‌) అయ్యే వ్యయంలో 85 శాతం దాకా రుణం ఇస్తారు. కాల పరిమితి ఆరేళ్లు. థర్డ్‌ పార్టీ గ్యారంటీ అవసరం లేదు. తొలిసారి వాహనాన్ని కొనుగోలు చేసేవారికి ఐటీఆర్‌ అక్కరలేదు.    

చదవండి : అదిరిపోయే లుక్‌, స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వివో 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top