భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'కియా ఇండియా' (Kia India) ఈ మే నెలలో సరికొత్త సేల్స్ ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. మారుతున్న మార్కెట్ పోటీని తట్టుకునేందుకు, స్టాక్‌ను క్లియర్ చేసేందుకు వీలుగా తన పూర్తి లైనప్‌లోని ఎంపిక చేసిన మోడళ్లపై కంపెనీ రూ. 2.70 లక్షల వరకు భారీ ప్రయోజనాలను, డిస్కౌంట్లను ప్రకటించింది.
కొత్తగా ఎస్‌యూవీ (SUV) లేదా ఎంపీవీ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఈ నెల అద్భుతమైన అవకాశంగా నిలవనుంది. కంపెనీ అందిస్తున్న ఈ ప్రయోజనాలలో ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ సపోర్ట్, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. మోడల్ వారీగా ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి..
కియా కార్నివాల్
ఈ నెలలో కియా లైనప్‌లో అత్యధిక డిస్కౌంట్ పొందుతున్న మోడల్ లగ్జరీ ఎంపీవీ 'కియా కార్నివాల్' (Kia Carnival). ఈ మోడల్‌పై రూ. 2 లక్షల వరకు భారీ ఎక్స్ఛేంజ్ సపోర్ట్ లభిస్తోంది. దీనికి అదనంగా స్క్రాపేజ్, కార్పొరేట్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా గరిష్టంగా రూ. 2.70 లక్షల వరకు ఆఫర్ ఉంది. ప్రీమియం ఫ్యామిలీ కార్, విశాలమైన క్యాబిన్ కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్.
కియా కారెన్స్ క్లావిస్
ఇటీవల మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కారెన్స్ క్లావిస్ (Kia Carens Clavis) టర్బో-పెట్రోల్ వేరియంట్లపై రూ. 1.55 లక్షల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. టర్బో వేరియంట్లకు అదనంగా 5 సంవత్సరాల కాంప్లిమెంటరీ ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీని కూడా కియా అందిస్తోంది. ఇదే మోడల్‌లోని డీజిల్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వెర్షన్లపై రూ. 85,000 వరకు మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయి.
కియా కారెన్స్ క్లావిస్ ఈవీ
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ MPV కొనుగోలు చేయాలనుకునే వారికి కారెన్స్ క్లావిస్ ఈవీ (Kia Carens Clavis EV)పై రూ. 2.15 లక్షల వరకు మొత్తం ప్రయోజనాలను అందిస్తోంది. ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, కార్పొరేట్ స్కీమ్‌ల రూపంలో కస్టమర్లు ఈ ఆఫర్లను పొందవచ్చు.
కియా సెల్టోస్
భారతదేశంలో కియా బ్రాండ్‌కు అత్యంత బలమైన సేల్స్ అందిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ'సెల్టోస్' (Kia Seltos)పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. గతేడాదికి చెందిన (Model Year 2025) ఇన్వెంటరీపై రూ. 95,000 వరకు గరిష్టంగా ఆఫర్లు ఉన్నాయి. సరికొత్త 2026 మోడళ్లపై డిస్కౌంట్ కొంత తక్కువగా (సుమారు రూ. 40,000 వరకు) ఉండే అవకాశం ఉంది. ఈ కారు హ్యుందాయ్ క్రెటా, టాటా సియెర్రా, మారుతి సుజుకి గ్రాండ్ విటారాలకు గట్టి పోటీనిస్తోంది.
కియా సిరోస్
సరికొత్తగా వచ్చిన సిరోస్ (Kia Syros) 2025 మోడల్ ఇన్వెంటరీపై రూ. 85,000 వరకు, అలాగే కొత్త 2026 మోడల్ యూనిట్లపై రూ. 50,000 వరకు తగ్గింపులను సొంతం చేసుకోవచ్చు.
కియా సోనెట్
కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో దూసుకుపోతున్న సోనెట్ (Kia Sonet) మోడల్‌పై ఆఫర్లు కాస్త పరిమితంగా ఉన్నాయి. 2026 మోడల్ స్టాక్‌పై రూ. 35,000 వరకు, 2025 మోడల్ యూనిట్లపై రూ. 30,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి.
స్టాండర్డ్ కియా కారెన్స్
రెగ్యులర్ కియా కారెన్స్ (Kia Carens) ఎంపీవీ మోడల్‌పై ఈ నెలలో రూ. 40,000 వరకు ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్‌లు అందుబాటులో ఉన్నాయి.
అయితే ఈ డిస్కౌంట్లు, ఆఫర్లు అనేవి డీలర్‌షిప్ వద్ద ఉన్న స్టాక్ లభ్యత, నగరం (ప్రాంతం), కొనుగోలుదారు అర్హత ఆధారంగా మారుతుంటాయి. కాబట్టి ఖచ్చితమైన ఆన్-రోడ్ ధరలు, ఫైనల్ ఆఫర్ వివరాల కోసం కస్టమర్లు తమ సమీపంలోని అధీకృత కియా డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.


