
జపాన్ షిప్పింగ్ దిగ్గజం మిత్సుయి ఓఎస్‌కే లైనర్స్ (ఎంవోఎల్) భారత్‌లో నౌకల తయారీకి సంబంధించి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. అలాగే త్వరలో రైల్వే లాజిస్టిక్స్ విభాగంలోకి కూడా ప్రవేశించే యోచనలో ఉంది. ఎంవోఎల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెప్టెన్ ఆనంద్ జయరామన్ ఈ విషయాలు తెలిపారు.
141 ఏళ్ల చరిత్ర గల ఎంవోఎల్ ప్రస్తుతం భారత్‌లో నాలుగో అతి పెద్ద షిప్‌ఓనర్‌గా కార్యకలాపాలు సాగిస్తోందని, రెండో స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని ఆయన వివరించారు. కొచ్చిన్ షిప్‌యార్డ్‌కి త్వరలో మధ్య స్థాయి షిప్ ట్యాంకర్ల కోసం ఆర్డర్లు ఇవ్వనున్నట్లు జయరామన్ చెప్పారు. మరోవైపు, భారత్‌లో 3–4 స్టార్టప్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేసే యోచనలో ఎంవోఎల్ ఉన్నట్లు ఆయన వివరించారు. భారీగా పెట్టుబడులు అవసరమయ్యే నౌకల నిర్మాణ మార్కెట్లో ప్రస్తుతం చైనా, దక్షిణ కొరియా, జపాన్ ఆధిపత్యం ఉండగా, భారత్ వాటా ఒక్క శాతం లోపే ఉంది.
ఇదీ చదవండి: ఐపీవోలకు కంపెనీల క్యూ..!