జియో హిట్‌ ప్లాన్‌: అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్‌! | Reliance Jio Rs.349 Plan Check Data Validity And Unlimited Calling, Check Out Plan Details Inside | Sakshi
Sakshi News home page

జియో హిట్‌ ప్లాన్‌: అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్‌!

Apr 2 2026 5:13 PM | Updated on Apr 2 2026 5:34 PM

Jio Rs 349 Plan Check Data Validity and Unlimited Calling Details Here

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను  అందిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ డేటా, అపరిమిత కాలింగ్ కోరుకునే వారి కోసం జియోలో ఓ పాపులర్‌ హిట్‌ ప్లాన్‌ అందుబాటులో ఉంది. అదే రూ. 349 ప్లాన్‌.

ప్లాన్ వివరాలు
జియో అందిస్తున్న ఈ రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. అంటే ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే దాదాపు నెల రోజుల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా మొబైల్ సేవలను ఆస్వాదించవచ్చు.

డేటా ధమాకా
ఈ ప్లాన్ ప్రధాన ఆకర్షణ దీని డేటా ప్రయోజనాలే. ప్రతిరోజూ 2 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. 28 రోజుల కాలపరిమితిలో వినియోగదారులకు మొత్తం 56 GB డేటా అందుబాటులో ఉంటుంది. రోజువారీ పరిమితి ముగిసిన తర్వాత కూడా తక్కువ వేగంతో ఇంటర్నెట్ వాడుకునే సౌలభ్యం ఉంటుంది.

అపరిమిత కాలింగ్, ఎస్‌ఎంఎస్
డేటాతో పాటు, ఈ ప్లాన్ ద్వారా దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. లోకల్, ఎస్టీడీ కాలింగ్స్ కోసం అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement