జెఫ్‌ బెజోస్‌ కీలక నిర్ణయం.. అమ్మకానికి అమెజాన్‌ షేర్లు!

Jeff Bezos Plan To Sell Up To 50 Million Amazon Shares  - Sakshi

అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న 12 నెలల కాలంలో ఏకంగా 50 మిలియన్ల అమెజాన్‌. కామ్‌ షేర్లను అమ్మేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తద్వారా బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం..  ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న ఆయన ప్రథమ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణుల అంచనా.

మహమ్మారి ప్రారంభంతో అమెజాన్‌లో అమ్మకాలు జోరందుకున్నాయి. ఆ సంస్థ షేర్లు సైతం భారీగా లాభపడ్డాయి. దీంతో దాదాపు 8 శాతం లాభపడి షేర్‌ ధర 172 డాలర్లకి చేరింది. ఈ క్రమంలో జెఫ్‌బెజోస్‌ అమెజాన్‌ షేర్లు అమ్మాలని నిర్ణయించుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

బెజోస్‌ నిర్ణయం అనంతరం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బెజోస్ సంపద శుక్రవారం 12.1 బిలియన్ డాలర్లు లాభపడింది. బిలియనీర్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్న ఎలాన్‌ మస్క్‌ అధిగమించాలంటే బెజోస్‌కు 8.1 బిలియన్‌ డాలర్లకు కావాల్సి ఉంది. కాగా,  బెజోస్ 2021 నుండి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నెంబర్‌ వన్‌ స్థానం కోసం పోటీపడుతూ వస్తున్నారు. కానీ అదెప్పుడ సాధ్యపడలేదు. 

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top