అమ్మ విషయంలో అది చాలా బాధగా ఉంటుంది: ఇన్ఫీ నారాయణమూర్తి 

Infosys NR Narayana Murthy Feels bad that he invited mother only when she was dying - Sakshi

సాక్షి,ముంబై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, కాటమరాన్ వెంచర్స్ ఛైర్మన్ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి తన జీవితంలో  బాధాకరమైన విషయాన్ని పంచుకున్నారు. తన తల్లి ఆరోగ్యంగా ఉన్నపుడు ఇన్ఫోసిస్‌ని చూడటానికి రమ్మని ఆమెను ఆహ్వానించకపోవడం నిజంగా బాధగా ఉందని మూర్తి గుర్తు చేస్తున్నారు. ఆమె ఇక చనిపోతుందన్న సమయంలో మాత్రమే ఇన్ఫోసిస్‌కి ఆహ్వానిం చానంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్ (IIMA)లో మాట్లాడుతూ  ఈ వ్యాఖ్యలు చేశారు.

పారిశ్రామికవేత్త, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అయిన మదన్ మొహంకా జీవితచరిత్రను మూర్తి ఆవిష్కరించారు. అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ అంజనా దత్ రచించిన "ఐ డిడ్ వాట్ ఐ హాడ్ టు డూ" అనే పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఇన్ఫీ మూర్తి తన తల్లి విషయంలో తాను చేయాల్సిన పొరపాటును గుర్తు చేసుకున్నారు. (సింగిల్‌ ట్రాన్సాక్షన్‌లో కోటి తగలెట్టేశా, ఈ ఘోర తప్పిదం నావల్లే!)

అలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. జీవితంలో కార్పొరేట్ నాయకుడి ప్రేరణ ఎలా ఉండాలనే దాని గురించి  మాట్లాడారు. ఒక సంస్థకునాయకుడిగా తీసుకునే నిర్ణయం పేద ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలని, ఈ విషయాన్ని తాను  మహాత్మా గాంధీ నుండి నేర్చుకున్నానని చెప్పారు. తాము తీసుకునే ఒక నిర్ణయం వల్ల  పేద ప్రజలకు  జరిగే నష్టం గురించి కార్పొరేట్‌ లీడర్లు ఆలోచించాలని సూచించారు.  

సంపద షేర్‌ చేసుకోవడం చాలా ప్రేరణ
సంపదను పంచుకోవడం అనేది పవర్‌ మోటివేషన్‌ అని, తన జీతంలో 1/10 వంతు మాత్రమే  జీతం తీసుకుని, జూనియర్లకు 20 శాతం అదనంగా ఇచ్చేవాడినని చెప్పుకొచ్చారు. ఒక టీంలో బాధ్యతకు ఉదాహరణ నిలుస్తుందన్నారు.

వినయం ఉండాలి, మన పాదాలు ఎపుడూ నేలపైనే  ఉండాలి
అంతేకాకుండా, ఉన్నత స్థాయి కార్యనిర్వాహకుడికి కావాల్సిన ముఖ్య లక్షణాలలో 'నమ్రత' ఒకటని కూడా ఆయన వివరించారు. తన కాలేజీలో, పరిశ్రమలో తనకంటే తెలివైన వారున్నప్పటికీ తన వినయమే కరీర్‌లో ఎదగడానికి  సాయ పడిందనీ, మన పాదాలు ఎప్పుడూ నేలపైనే ఉండాలంటూ తనను తాను ఉదాహరణగా చెప్పారు. అలాగే విద్యార్థులు  మంచి నాయకులుగా ఎదగడానికి అధ్యాపకులను సంప్రదించాలని సలహా ఇచ్చిన ఆయన, మెరుగైన కంపెనీని  నిర్మించడంలో ఫ్యాకల్టీ సభ్యులు  కంపెనీ సీఈవోలకు సాయపడాలని కూడా   వెల్లడించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top