breaking news
NR Narayana Murthy
-
అమ్మ విషయంలో అది చాలా బాధగా ఉంటుంది: ఇన్ఫీ నారాయణమూర్తి
సాక్షి,ముంబై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, కాటమరాన్ వెంచర్స్ ఛైర్మన్ఎన్ఆర్ నారాయణమూర్తి తన జీవితంలో బాధాకరమైన విషయాన్ని పంచుకున్నారు. తన తల్లి ఆరోగ్యంగా ఉన్నపుడు ఇన్ఫోసిస్ని చూడటానికి రమ్మని ఆమెను ఆహ్వానించకపోవడం నిజంగా బాధగా ఉందని మూర్తి గుర్తు చేస్తున్నారు. ఆమె ఇక చనిపోతుందన్న సమయంలో మాత్రమే ఇన్ఫోసిస్‌కి ఆహ్వానిం చానంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ (IIMA)లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్త, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అయిన మదన్ మొహంకా జీవితచరిత్రను మూర్తి ఆవిష్కరించారు. అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ అంజనా దత్ రచించిన "ఐ డిడ్ వాట్ ఐ హాడ్ టు డూ" అనే పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఇన్ఫీ మూర్తి తన తల్లి విషయంలో తాను చేయాల్సిన పొరపాటును గుర్తు చేసుకున్నారు. (సింగిల్ ట్రాన్సాక్షన్లో కోటి తగలెట్టేశా, ఈ ఘోర తప్పిదం నావల్లే!) అలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. జీవితంలో కార్పొరేట్ నాయకుడి ప్రేరణ ఎలా ఉండాలనే దాని గురించి మాట్లాడారు. ఒక సంస్థకునాయకుడిగా తీసుకునే నిర్ణయం పేద ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలని, ఈ విషయాన్ని తాను మహాత్మా గాంధీ నుండి నేర్చుకున్నానని చెప్పారు. తాము తీసుకునే ఒక నిర్ణయం వల్ల పేద ప్రజలకు జరిగే నష్టం గురించి కార్పొరేట్ లీడర్లు ఆలోచించాలని సూచించారు. సంపద షేర్ చేసుకోవడం చాలా ప్రేరణ సంపదను పంచుకోవడం అనేది పవర్ మోటివేషన్ అని, తన జీతంలో 1/10 వంతు మాత్రమే జీతం తీసుకుని, జూనియర్లకు 20 శాతం అదనంగా ఇచ్చేవాడినని చెప్పుకొచ్చారు. ఒక టీంలో బాధ్యతకు ఉదాహరణ నిలుస్తుందన్నారు. వినయం ఉండాలి, మన పాదాలు ఎపుడూ నేలపైనే ఉండాలి అంతేకాకుండా, ఉన్నత స్థాయి కార్యనిర్వాహకుడికి కావాల్సిన ముఖ్య లక్షణాలలో 'నమ్రత' ఒకటని కూడా ఆయన వివరించారు. తన కాలేజీలో, పరిశ్రమలో తనకంటే తెలివైన వారున్నప్పటికీ తన వినయమే కరీర్లో ఎదగడానికి సాయ పడిందనీ, మన పాదాలు ఎప్పుడూ నేలపైనే ఉండాలంటూ తనను తాను ఉదాహరణగా చెప్పారు. అలాగే విద్యార్థులు మంచి నాయకులుగా ఎదగడానికి అధ్యాపకులను సంప్రదించాలని సలహా ఇచ్చిన ఆయన, మెరుగైన కంపెనీని నిర్మించడంలో ఫ్యాకల్టీ సభ్యులు కంపెనీ సీఈవోలకు సాయపడాలని కూడా వెల్లడించారు. -
వ్యక్తిగతంగా వేధించారు: సిక్కా
సాక్షి, న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవోగా వైదొలగిన విశాల్ సిక్కా కంపెనీ వ్యవస్థాపకులపై విరుచుకుపడ్డారు. ఇన్ఫోసిస్ బోర్డుకు, ఎన్ఆర్ నారాయణమూర్తి వంటి హై ప్రొఫైల్ వ్యవస్ధాపకులకు మధ్య తాను నలిగిన తీరును వివరించారు. కంపెనీ సీఈవో విధుల్లో కొనసాగలేనని, నిరాధారమైన విషపూరిత వ్యక్తిగత దాడులను నిలువరిస్తూ పనిచేయలేనని సిక్కా తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను ఈ సందర్భంగా కంపెనీ ఉద్యోగులకు వివరించారు. గత కొన్ని వారాలుగా రాజీనామాపై తాను తర్జనభర్జనలు పడ్డానని, సుదీర్ఘంగా ఆలోచించిన మీదట గత కొన్ని త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఎండీ, సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నానన్నారు. గత మూడేళ్లుగా కంపెనీ ఎన్నో విజయాలను సాధించి, వినూత్న ఒరవడికి బాటలు వేసినప్పటికీ నిరాధార, వ్యక్తిగత దాడులు, ఆరోపణలను తట్టుకుని ఇక తాను పనిచేయలేనని స్పష్టం చేశారు. గత మూడేళ్లుగా కంపెనీ సాధించిన విజయాల్లో ఉద్యోగులందరి భాగస్వామ్యం ఉందన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకూ ఇన్ఫోసిస్ బోర్డు, యాజమాన్యంతో కలిసి పనిచేస్తానని చెప్పారు. నాయకత్వ మార్పిడి జరిగే వరకూ బోర్డులో ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించేందుకు అంగీకరించినట్టు సిక్కా తెలిపారు.